Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త కరెన్సీ నోట్లపై కొత్త డౌట్లు... జంతువుల కొవ్వుతో చేశారా? చిప్ పెట్టాలనుకున్నా కానీ వ్యయం?

కొత్త కరెన్సీ నోట్లపై కొత్త కొత్త విషయాలు పుట్టుకొస్తున్నాయి. దేశంలోకి కొత్త కరెన్సీ విడుదల కాగానే, రూ. 2 వేల నోటును నీళ్ల కింద తడిపి, నానబెట్టి, రంగు వెలిసి పోతోందేమోనని పసిగట్టి సోషల్ మీడియాలో వీడియ

Advertiesment
Outrage in U.K. after animal fat used in bank notes
, శుక్రవారం, 2 డిశెంబరు 2016 (12:03 IST)
కొత్త కరెన్సీ నోట్లపై కొత్త కొత్త విషయాలు పుట్టుకొస్తున్నాయి. దేశంలోకి కొత్త కరెన్సీ విడుదల కాగానే, రూ. 2 వేల నోటును నీళ్ల కింద తడిపి, నానబెట్టి, రంగు వెలిసి పోతోందేమోనని పసిగట్టి సోషల్ మీడియాలో వీడియోలో పోస్ట్ చేసిన నేపథ్యంలో, మరిన్ని వెరైటీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. 
 
ఇంగ్లండ్‌లో కరెన్సీ నోట్లను జంతువుల కొవ్వుతో తయారు చేసినట్టు అక్కడి బ్యాంకులు స్వయంగా అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, భారత ప్రభుత్వం కూడా అలాగే చేసిందా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తున్నాయి. 
 
కొత్త కరెన్సీ నోట్లు కొవ్వుతో తయారైనవా అని తేల్చేందుకు కొత్త కరెన్సీ నోట్లను మరుగుతున్న నూనెలో వేసి ఏం జరుగుతుందో చూస్తున్నారు. నోట్లలో ఉబ్బెత్తుగా ఉన్న భాగాలు జంతువుల కొవ్వుతో ముద్రితమైనవని అనుమానిస్తున్నారు. ఇక నోటు తయారీలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ వాడలేదన్న వివరణ వచ్చేంత వరకూ ఈ వీడియోలు హల్ చేస్తుంటాయనడంలో సందేహం లేదు.
 
పాత 500, 1000 నోట్ల రద్దు తర్వాత వచ్చిన కొత్త 2000 నోటు మరియు 500 నోట్లను సెక్యూరిటీ పరంగా హై ఎండ్‌లో తయారు చేయాలని ఆర్బీఐ భావించింది. అందుకోసం కొత్తగా తయారు చేసిన నోట్లలో చిన్న చిప్‌ పెట్టారు అని, ఆ చిప్‌ బ్లాక్‌ మనీ ఎక్కడ ఉన్నా కూడా సందేశాలు ఇస్తుందని అంతా టాక్‌ వచ్చింది. అయితే ఆ తర్వాత ఆర్బీఐ ఒక ప్రకటనలో కొత్త నోట్లలో ఎలాంటి చిప్‌లు పెట్టలేదు అని వెళ్లడి చేసింది.
 
తాజాగా ఆర్బీఐకి చెందిన ఒక అధికారి కొత్త నోట్ల గురించి మాట్లాడుతూ.. మొదట కొత్త నోట్లలో చిప్‌ను పెట్టాలని భావించడం జరిగింది. చిప్‌ తరహాలో ఉండే పార్టికల్స్‌ను అయినా కొత్త నోట్లలో పెట్టాలని అనుకున్నాం. కాని తయారీ వ్యయం ఎక్కువ కావడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా చెప్పారు. భవిష్యత్తులో నోట్లలో పార్టికల్స్‌ పెట్టే అవకాశాలు లేక పోలేదు అని ఆర్బీఐ అధికారి చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారికర్ కళ్లు పీకేస్తారా?రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉగ్రదాడులు తప్పవ్: ఫరూక్ అబ్ధుల్లా