Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదిమంది ఎమ్మెల్యేలు జంప్ అయితే పళని ఔట్: డీఎంకె వ్యతిరేక ఓటు కీలకం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి శనివారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోనందునే ఉత్కంఠకు తెరపడింది. విశ్వాస పరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగానే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని

Advertiesment
ten MLA's
హైదరాబాద్ , శనివారం, 18 ఫిబ్రవరి 2017 (05:51 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి శనివారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోనందునే ఉత్కంఠకు తెరపడింది. విశ్వాస పరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగానే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా దెబ్బతిందని, ప్రజాజీవనం అతలాకుతలమైందని ఆయన విమర్శించారు. సుస్థిర పాలన కావాలని తాము మొదట్నించీ కోరుతున్నట్టు చెప్పారు. ఇందుకు అనుగుణంగానే పళనిస్వామికు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ నిర్ణయించినట్టు మీడియాకు తెలిపారు. అంతకుముందు స్టాలిన్ అధ్యక్షతన అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో 89 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. 
 
కాగా, డీఎంకే బాటనే కాంగ్రెస్ కూడా ఎంచుకుంది. పళనిస్వామి విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 
 
డీఎంకే ఎమ్మెల్యేలు 89 మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 మంది, పన్నీర్ సెల్వంకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు 12 మంది మొత్తం 110 ఓట్లు, పళనిస్వామి వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య 124. బలపరీక్షలో నెగ్గడానికి కావలసిన మ్యాజిక్ నెంబర్ 115. అంటే కేవలం 10 మంది శశికళ వర్గం ఎమ్మెల్యేలు అటునుంచి ఇటు జంప్ చేస్తే పళనిస్వామి ప్రభుత్వం పని గోవిందా అయిపోయే అవకాశం. 
 
ఇప్పటికే మైలాపూర్ ఎమ్మెల్యే మాజీ డీజీపీ నటరాజ్ జయ వ్యతిరేకించిన వారికి తాను ఓటెయ్యనని తేల్చి చెప్పేశారు. గోల్టెన్ రిసార్ట్ బేలో విడిది చేసిన ఎమ్మెల్యేల్లో 20 మంది ఇప్పటికే పళనిపై తిరుగుబాటు ప్రకటించారని, అందుకే జైల్లోని శశికళ వద్దకు కాకుండా పళని రిసార్టుకు పరుగెత్తుకెళ్లి బుజ్జగింపు మొదలెట్టారని వార్తలు. మరోవైపు ఒక్కో ఎమ్మెల్యేకి అయిదు కోట్లు ఇస్తామని బేరం కుదుర్చుకుని ఇప్పటికే సగం డబ్బులు ఇచ్చి మిగతా సగం బలపరీక్షలో నెగ్గాక ఇస్తామని పళని వర్గీయులు చెప్పారని కూడా వార్తలు, వీటిలో ఏది నిజమైనా, కాకున్నా, కేవలం పది మంది ఎమ్మెల్యేలు స్థానాలు మారితే పళని ప్రభుత్వం ఔట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
మరో అయిదు గంటల్లో అసెంబ్లీలో జరగనున్న బలపరీక్ష ఎవరి భవితవ్యాన్ని తేల్చిపడేయనుందోనని తమిళనాడు మొత్తం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ రావణ కాష్టానికి కారణం ఇప్పుడైనా తెలుసుకుంటావా పాక్?