Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్కింటి మహిళతో తల్లి మాటలు.. ఉల్లిపాయ మింగేసిన చిన్నారి.. ఊపిరాడక.. ఏడ్వలేక..?

తల్లి నిర్లక్ష్యం కారణంగా ఏడాది చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పక్కింటి మహిళతో మాట్లాడుతూ తన బిడ్డను పట్టించుకోని ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఇంతకీ ఏమైందంటే.. ఉల్లిపాయను మింగేసిన ఏడాది చిన్న

Advertiesment
One-year-old
, సోమవారం, 24 అక్టోబరు 2016 (20:19 IST)
తల్లి నిర్లక్ష్యం కారణంగా ఏడాది చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పక్కింటి మహిళతో మాట్లాడుతూ తన బిడ్డను పట్టించుకోని ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఇంతకీ ఏమైందంటే.. ఉల్లిపాయను మింగేసిన ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కనహోసాహళ్లి గ్రామానికి చెందిన కల్పేశ్, అర్చనలకు నిత్య శ్రీ అనే కుమార్తె వుంది. శనివారం ఇంటి బాల్కనీలో నిత్య శ్రీ ఆడుకుంటూ వుంది. అర్చన పక్కింటి మహిళతో మాట్లాడుకుంటూ వుండిపోయింది. ఇక వరండాలో ఆరబెట్టిన ఉల్లిపాయలతో ఆడుకుంటున్న నిత్యశ్రీ.. ఉల్లిని మింగేసింది. ఇక ఉల్లిపాయ గొంతుకు అడ్డుపడటంతో నిత్యకు ఊపిరిరాడక ఇబ్బంది పడింది. 
 
కనీసం ఏడ్వలేకపోయింది. కొద్దిసేపటికే స్పృహ తప్పి కిందపడిపోయింది. దీన్ని గమనించిన నిత్య తల్లి అర్చన కంగారుతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఊపిరాడక పోవడంతో చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అర్చన బోరున విలపించింది. నిత్య మృతితో బళ్లారిలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ అనంత సభ: జనసేనకు పనికొస్తుందా? ప్రజలకు మేలు చేస్తుందా? హోదా గోవిందా?