Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ ఆస్పత్రిలో ఏం చేశారంటే..? నర్సులతో బంతాట ఆడుకున్నారట.. ఉప్మా, పొంగల్ అంటే చాలా ఇష్టమట..

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీ చెన్నై అపోలోలో చేరిన అమ్మకు ఆదివారం (డిసెంబర్ 4)వ తేదీ గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు. అలాగే గుండెపోటుకు ఇచ్

Advertiesment
One morsel
, గురువారం, 8 డిశెంబరు 2016 (16:55 IST)
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీ చెన్నై అపోలోలో చేరిన అమ్మకు ఆదివారం (డిసెంబర్ 4)వ తేదీ గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు. అలాగే గుండెపోటుకు ఇచ్చిన చికిత్స ఫలించక డిసెంబర్ 5వ తేదీ జయలలిత కన్నుమూసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఏం జరిగిందనే విషయంపై నర్సు మీడియాతో చెప్పుకొచ్చింది. 
 
అమ్మ చికిత్స పొందుతున్న గదికి వెళ్లగానే మమ్మల్ని చూసి అమ్మ నవ్వేవారని.. పలకరించేవారని.. కానీ ఆదివారం జయలలిత నోట మాట రాలేదు. నవ్వు కూడా కనబడలేదు. దీంతో అనుమానం వచ్చి వెంటిలేటర్‌తో పరిశోధించామని.. అప్పుడే ఆమెకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించినట్లు నర్సు తెలిపింది. ఆ తర్వాత జయలలిత కన్నుకూడా తెరవలేదని.. సోమవారం ప్రాణాలు కోల్పోయారని.. 75 రోజుల పాటు జయకు సహకరించిన నర్స్ ఒకరు మీడియాకు చెప్పారు. 
 
ఇదిలా ఉంటే, అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు జయలలితకు షీలా, రేణుకా, శాముండేశ్వరి అనే ముగ్గురు నర్సులంటే చాలా ఇష్టం. ఐరన్ లేడీ అని పేరు తెచ్చుకున్న జయలలితలో ఉన్న సున్నితత్వాన్ని ఆ నర్సులు.. ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు చూశామంటున్నారు. జయలలిత వద్ద 16 మంది నర్సులు పనిచేశామని.. ఆమెకు ఉప్మా, పొంగల్, పెరుగు అన్నం, పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టమట. స్పూన్ ద్వారా ఈ ఫుడ్స్ తీసుకుంటారని, నర్సుల పేర్లు చెపుతూ.. శాము (శాముండేశ్వరి) కోసం ఓ ముద్ద, షీలా కోసం మరో ముద్ద తీసుకుంటానని చెప్పేవారట. 
 
ఇలా అమ్మ వద్ద సీవీ షీలా, ఎంవీ రేణుకా మరియు శాముండేశ్వరి అనే ముగ్గురు నర్సులే కింగ్ కాంగ్స్. జనరల్ వార్డుకు జయమ్మ మారాక రోజుకోసారి గంట పాటు టీవీ చూసేవారని, ఓల్డ్ తమిళ పాటలు వినేవారట. టీవీల్లో తన కోసం ప్రార్థించే వేలాది మంది ప్రజల గురించే నర్సుల వద్ద జయలలిత మాట్లాడేవారని స్టాఫ్ నర్స్ రేణుకా తెలిపారు. ఇంకా చెప్పాలంటే.. ఆమె నర్సులతో బంతాట ఆడుకున్నారట.
 
ఫిజియోథెరపిస్టుల సలహాల మేరకు నర్సులు బంతాట ఆడుకునేవారట. అయితే ముఖ్యమంత్రి అయినప్పటికీ తామిచ్చిన సలహాలను జయమ్మ చక్కగా పాటించేవారని.. ఎక్కడా ఆమె అసహనం వ్యక్తం చేయలేదని.. తాను అలసిపోయానని మళ్లీ ఆడుదామని సున్నితంగా చెప్పేవారని నర్సులు చెప్పుకొచ్చారు.
 
ఈ  నేపథ్యంలో జయలలిత తన ఆస్తులకు సంబంధించి వీలునామా రాసివుండకపోవచ్చునని సంపాదకుడు జ్ఞాని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న 75 రోజుల్లో అమ్మ వీలునామా రాసే ఛాన్స్ లేదని.. ఎందుకంటే.. ఆమె నర్సులతో జోకులేస్తూ, ఇంటికి రండని పిలుస్తూ.. మంచి టీ ఇప్పిస్తానని చెబుతూ గడిపారు. ఇంకా నర్సులను సచివాలయానికి రమ్మని కూడా పిలుపునిచ్చారని నర్సులే తెలిపారు. 
 
వీటిని బట్టి చూస్తే అమ్మ ఇంటికెళ్ళిపోదాం.. అనే దృఢ సంకల్పంతో ఉన్నారని.. అలాంటి పరిస్థితుల్లో వీలునామా రాసివుండరని జ్ఞాని తెలిపారు. ఒకవేళ అమ్మ ఆస్పత్రిలో చేరకముందు ఏదైనా రాసివుండాలని.. జ్ఞాని అనుమానం వ్యక్తం  చేశారు. కాగా అమ్మ ఆస్తులు ఎవరికి దక్కుతాయనే దానిపై సర్వత్రా చర్చ సాగుతున్న తరుణంలో ఆమె వీలునామా రాసివుండకపోవచ్చునని జ్ఞాని తెలపడం కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాకింగ్... తితిదే బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో క్వింటాలు(100 కిలోలు) బంగారం, రూ.70 కోట్ల కొత్త కరెన్సీ