Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్లధనం పంచేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఒక్కొక్కరికీ రూ.3లక్షల కట్టలు.. గ్రామ ప్రజలకు పంపిణీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు తలపట్టుకుని కూర్చుంటున్నారు. తాజాగా కర్ణాటకలోని కోలార్‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనవద్ద మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు తీశాడు. ఆ న

Advertiesment
Old photos
, గురువారం, 10 నవంబరు 2016 (12:48 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు తలపట్టుకుని కూర్చుంటున్నారు. తాజాగా కర్ణాటకలోని కోలార్‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనవద్ద మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు తీశాడు. ఆ నల్లధనాన్ని ప్రజలకు పంచేశాడు. దీంతో హీరో అయిపోయాడు.

నల్లధనం పంపిణీ కోసం నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి, మూడు లక్షల రూపాయల చొప్పున డబ్బును కట్టలుగా కట్టి, ఒక్కొక్కరికి పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు సంబరపడిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
కాగా రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎమ్మెల్యే వద్ద నల్ల డబ్బు ఉన్నదని ఈ డబ్బును ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు పంచిపెట్టేశారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు డబ్బు పంచే ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాట్సాప్‌ల్లోనూ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ డబ్బును వైట్ మనీ చేసేందుకే సదరు ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు ఇచ్చాడని.. వైట్ చేసుకున్నాక వారి వద్ద లాగేసుకుంటాడని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కండువాలు క‌ప్పి... కోర‌లు పీకారు... ఇదీ వైకాపా జంపింగ్ ఎమ్మెల్యేల దుస్థితి