Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్ ప్రేమ.. అట్టహాసంగా ట్రాన్స్‌జెండర్‌ పెళ్లి.. ఒడిశాలో అరుదైన ఘటన

దేశంలోనే అరుదైన ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగింది. మేఘన అనే ట్రాన్స్‌జెండర్ వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. చట్టరీత్యా చెల్లుబాటు కానప్పటికీ పెద్దల అంగీకారంతో పెళ్లి వేడుక అట్టహాసంగా

Advertiesment
Odisha man
, శుక్రవారం, 27 జనవరి 2017 (17:16 IST)
దేశంలోనే అరుదైన ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగింది. మేఘన అనే ట్రాన్స్‌జెండర్ వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. చట్టరీత్యా చెల్లుబాటు కానప్పటికీ పెద్దల అంగీకారంతో పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వివాహానికి బంధుమిత్రులు, స్నేహితులతో పాటు నగర మేయర్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్‌కు చెందిన వసుదేవ్ ఇదివరకే ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ ఇద్దరు పిల్లలు పుట్టాక అతని భార్య ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. పిల్లల్ని చూసుకుంటూ కాలం గడుపుతున్న వసుదేవ్‌కు ఫేస్‌బుక్ ద్వారా ట్రాన్స్‌జెండర్‌ మేఘన పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు. 
 
మొదట వీరి పెళ్ళికి అభ్యంతరం ఎదురైనా.. చివరికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో శుక్రవారం వేదమంత్రాల నడుమ వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా మేఘన మాట్లాడుతూ, తనను కోడలిగా స్వీకరించిన వసుదేవ్ కుటుంబానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తానూ తల్లినవుతానని చెప్పుకొచ్చింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సీఎంను టచ్ చేస్తున్నావ్' అని జగన్ అన్నారా...?