ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. సంఘటన స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో 41మంది ప్రయాణీకులు గాయాలకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వారు చెప్పారు.