Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పన్నీర్‌కు మరో ఛాన్స్... ఫ్యాక్స్ రాజీనామా చెల్లదట... నిజమేనా?

తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠంగా మారుతోంది. అక్రమాస్తుల కేసులో శశికళకు జైలుశిక్ష పడినప్పటికీ ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతున్నారు. వీరిలో ఒకరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వ

పన్నీర్‌కు మరో ఛాన్స్... ఫ్యాక్స్ రాజీనామా చెల్లదట... నిజమేనా?
, బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (20:42 IST)
తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠతగా మారుతోంది. అక్రమాస్తుల కేసులో శశికళకు జైలుశిక్ష పడినప్పటికీ ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతున్నారు. వీరిలో ఒకరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మరొకరు ఎడప్పాడి పళని స్వామి. ఈ ఇద్దరు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడుతున్నారు. అయితే విద్యాసాగర్ రావుకు ఈజీగా నిర్ణయం వెలువరించే అవకాశం లేకపోలేదు. కారణం శశికళకు జైలు శిక్ష పడింది కాబట్టి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
ఇక మిగిలింది బలనిరూపణే. రేపోమాపో బలనిరూపణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖాయమంటున్నారు. అయితే ఒక కొత్త వాదన వినిపిస్తోంది. అదే పన్నీరు సెల్వం రాజీనామా చేసే సమయంలో ఫ్యాక్స్ ద్వారా గవర్నర్‌కు పంపారట. అత్యున్నత పదవిలో ఉన్న సిఎం ఫ్యాక్స్ ద్వారా పంపిస్తే అది చెల్లదంటున్నారు ఆయన వర్గీయులు.  
 
కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అన్నాడిఎంకే పార్టీ సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వంను తొలగించిన తర్వాత ఆయన ఏ హోదాలో వెళతారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరి వాదన ఎలాగున్నా పన్నీర్ సెల్వంను సిఎం చేసేంతవరకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గదన్నది రాజకీయ విశ్లేషకుల భావన. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిజెపికి అంతా మైత్రేయనే.. ఆయన చెప్పినట్టే గవర్నర్ నడుచుకుంటున్నారా?