Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముప్పు పొంచివుంటే తప్పక దాడి చేస్తాం .. అజిత్ ధోవల్ :: క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Advertiesment
ముప్పు పొంచివుంటే తప్పక దాడి చేస్తాం .. అజిత్ ధోవల్ :: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
, సోమవారం, 26 అక్టోబరు 2020 (12:31 IST)
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 24న రిషికేశ్‌లోని పరమార్థ నికేతన్ ఆశ్రమంలో భక్తులను ఉద్దేశించి అజిత్ ధోవల్ మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా భారతదేశ ఆధ్యాత్మికత గొప్పదనం గురించి చెప్పారు. ఏ దేశంపై కూడా మనం దాడి చేయలేదనే విషయం అందరికీ తెలుసని... కానీ, ఏ దేశం నుంచైనా మనకు ముప్పు పొంచి ఉంటే మాత్రం... మనం తప్పకుండా దాడి చేస్తామని చెప్పారు. మన దేశాన్ని కాపాడుకోవడానికి ఈ పని చేయాల్సిందేనని అన్నారు. 
 
ధోవల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. లడఖ్ విషయంలో చైనాను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. చైనాను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ తెరపైకి రావడంతో కేంద్రం కలుగజేసుకుంది. ఆధ్యాత్మిక ధోరణితో తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే ధోవల్ చెప్పారని కేంద్రం తెలిపింది. ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి ధోవల్ వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా పండుగ రోజున దేవుడికి నాలుకను నైవైద్యంగా పెట్టిన భక్తులు!!