Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీడియో లీక్ ఎఫెక్ట్ : శశికళ జాలీ జైలు రాజవైభోగాలకు కత్తెర...

అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళ జైలు రాజవైభోగాలకు తెరపడింది. జైలులో శశికళ జాలీగా ఉన్న వీడియో ఒకటి బహిర్గతమైంది. ముఖ్యంగా జైలు లోపలసాగుతున్న అవినీతి, అక్

వీడియో లీక్ ఎఫెక్ట్ : శశికళ జాలీ జైలు రాజవైభోగాలకు కత్తెర...
, బుధవారం, 19 జులై 2017 (11:09 IST)
అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళ జైలు రాజవైభోగాలకు తెరపడింది. జైలులో శశికళ జాలీగా ఉన్న వీడియో ఒకటి బహిర్గతమైంది. ముఖ్యంగా జైలు లోపలసాగుతున్న అవినీతి, అక్రమాలు రచ్చకెక్కటంతో అధికారులు నియమపాలనపై ఆంక్షలు విధించారు. శశికళ, ఆమె వదిన ఇళవరసిలు సోమవారం నుంచి ఖైదీ దుస్తులను ధరించి సాధారణ ఖైదీల్లా మామూలు గదిల్లో బందీలుగా కాలాన్ని గడిపారు. ఇంటి భోజనంకు బదులుగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పులిహోర, పెరుగన్నం, సాంబారు అన్నం, సంగటి ముద్దనే ఆరగించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. 
 
ఈ కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళ, ఇళవరసిలకు బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులోని ఒక అంతస్తులో జైలు అధికారులు ఐదు గదులను కేటాయించారు. దీంతో శశికళ జైలులో కూడా సొంతింట్లోనే ఉన్నట్టుగానే భావించి... రాజ వైభవాన్ని అనుభవించారు. ఇప్పుడు అది చరిత్రగా మారింది. మళ్లీ సాధారణ జైలు జీవితానికి వచ్చారు.
 
కాగా, జైలులో శశికళ పొందుతున్న సౌకర్యాల గురించి జైళ్ళ శాఖ డీఐజీ రూప మౌద్గిల్ బహిర్గతం చేసి సంచలనం సృష్టించారు. సౌకర్యాల కోసం రూ.2 కోట్లను జైలు సిబ్బందికి లంచంగా ఇచ్చారంటూ ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన మరునాడే ఆమెపై కర్ణాటక ప్రభుత్వం బదిలీ వేటు వేసిన విషయం తెల్సిందే. అయినప్పటికీ ఆమె ఏమాత్రం బెదరడం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ భీష్ముడు ఎల్కే.అద్వానీకి భారతరత్న పౌరపురస్కారం?