Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకులో రూ.246 కోట్లు జమ చేసిన తమిళనాడు మంత్రి!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కోట్లాది మంది అవినీతిపరులు గగ్గోలు పెట్టారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. చెల్లని నోట్లను మ

Advertiesment
Note ban
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (14:44 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కోట్లాది మంది అవినీతిపరులు గగ్గోలు పెట్టారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. చెల్లని నోట్లను మార్చుకునేందుకు సమయం ఇచ్చినప్పటికీ... పరిమిత సంఖ్యలోనే మార్చుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెల్సిందే.  
 
కానీ, తమిళనాడుకు చెందిన మంత్రి ఒకరు తన పరపతిని ఉపయోగించి ఏకంగా రూ.246 కోట్లను తన బినామీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసినట్టు తాజాగా వెల్లడైంది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. అయితే, ఈ మొత్తానికి భారీ మొత్తంలో అపరాధం వసూలు చేయడంతో వారు తప్పించుకున్నారు. 
 
ఈ మొత్తాన్ని తన బినామీతో డిపాజిట్ చేయించిన ఆ మంత్రి ఎవరన్నది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకేస్టాలిన్ స్పందించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసిన మంత్రి ఎవరో, బినామీ వ్యక్తి పేరును ప్రజలకు తెలియాల్సి ఉందని అన్నారు. ఆ వ్యక్తి పేరును మీడియా బహిరంగపరచాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇర్మా హరికేన్.. భారతీయులు క్షేమం : సుష్మా స్వరాజ్