Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై నగరం సురక్షితం కాదా? సీఎం ఫడ్నవిస్ ఏమంటున్నారు?

Advertiesment
devendra fadnavis

ఠాగూర్

, గురువారం, 16 జనవరి 2025 (17:28 IST)
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఆయన నివాసంలోనే ఓ దండుగుడు కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటనతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాధారణ ప్రజలకే కాదు.. ముంబై నగర వాసులకు కూడా ముంబై మహానగరం సురక్షితం కాదా అనే ప్రశ్న ఉన్నమైంది. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. సైఫ్ దాడిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేతలు చేస్తున్న విమర్శలు ఏమాత్రం న్యాయ సమ్మతం కాదన్నారు. 
 
'దేశంలోని అన్ని మెగాసిటీల్లో కెల్లా ముంబై సురక్షితమైనది. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయనేది వాస్తవమే. వాటిని తీవ్రంగా పరిగణించాలి. కానీ, ఒక్క సంఘటనను ఆధారంగా చేసుకుని ముంబై సురక్షితమైన ప్రాంతం కాదని ప్రచారం చేయడం సమంజసం కాదు. ఇది ముంబై ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేస్తున్నా ప్రయత్నమే. నగరాన్ని మరింత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందిట అని వ్యాఖ్యానించారు. 
 
అంతకుముందు విపక్ష నేతలు, సినీ ప్రముఖులు మాట్లాడుతూ, 'ఇంత సురక్షిత ప్రదేశంలో ఉంటున్నా ప్రముఖ నటుడిపై దాడి జరగడం ఆందోళనకరం. గతంలోనూ సల్మాన్‌ ఖాన్‌ నివాసంపై కాల్పులు జరిగాయి. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీను హత్య చేశారు. ముంబై నగరం సురక్షితం కాదు. సైఫ్‌ అలీఖాన్‌ వంటి సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి' అంటూ ప్రశ్నించారు. 
 
కాగా, గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆయనకు వెన్నెముక, మెడ, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సైఫ్‌.. ప్రస్తుతం కోలుకుంటున్నారు. నటుడి ఇంట్లోకి వచ్చి ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్టీ గీత దాటిన జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్!