నీ భార్యను అమ్ముకో.. భార్యల విలువ రూ.12వేల కంటే తక్కువైతే?
స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో ఓ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చేపట్టిన ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ (డ
స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో ఓ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చేపట్టిన ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎమ్) డీఎమ్ కన్వాల్ తనూజ్ గ్రామానికి వెళ్లారు. అక్కడ మరుగుదొడ్లు కట్టించుకోవాలన్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి లేచి, తమకు కూడా మరుగుదొడ్డి కట్టించుకోవాలని ఉందని, అయితే అందుకు సరిపడా డబ్బు తమ వద్ద లేదన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన కన్వాల్ 'డబ్బు లేకపోతే నీ భార్యను అమ్ముకో' అంటూ నోరు జారారు. దీంతో గ్రామస్థులంతా షాక్ తిన్నారు.
అందరికీ చెప్పేదేమిటంటే.. మీ భార్యల గౌరవం కాపాడుకోవాలంటే మరుగుదొడ్డి తప్పక నిర్మించుకోవాలి. మీ భార్యల విలువ 12,000 రూపాయల కంటే తక్కువని అనుకుంటే మాత్రం మరుగుదొడ్డిని నిర్మించుకోవద్దు' అని సూచించారు. అంతేకాకుండా మరుగుదొడ్ల కోసం ప్రభుత్వం ముందుగా డబ్బులిస్తే వాటిని వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. దీంతో గ్రామస్థులంతా కన్వాల్‌పై మండిపడుతున్నారు.