Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళికాని ప్రసాద్‌ల సంఖ్య అప్.. పెళ్ళికూతుళ్లు దొరకట్లేదండోయ్

దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలతో అమ్మాయిలను పుట్టకూడదని కొందరనుకుంటే.. వారసత్వం కోసం మహిళలే వద్దనుకునేవారు మరికొందరు. ఆస్తులకు, తండ్రిపేరు నిలబెట్టేందుకు పురుషుడే కావాలనే సంస్కృతి ఇంకా భారత దేశ

Advertiesment
No marriages for Indian men
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:46 IST)
దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలతో అమ్మాయిలను పుట్టకూడదని కొందరనుకుంటే.. వారసత్వం కోసం మహిళలే వద్దనుకునేవారు మరికొందరు. ఆస్తులకు, తండ్రిపేరు నిలబెట్టేందుకు పురుషుడే కావాలనే సంస్కృతి ఇంకా భారత దేశంలో ఉందని.. ఎంతగా టెక్నాలజీ డెవలప్ అయినా.. ఆడవారిపై పెరుగుతున్న అఘాయిత్యాలు, ఆగడాలు ఏమాత్రం తగ్గట్లేదు. అందుకేనేమో... మన దేశంలో అమ్మాయిల కొరత ఏర్పడింది. 
 
ఎలాగంటే.. ఇప్పటికే చాలామంది పెళ్ళి కాని ప్రసాదులు.. చాలామంది ఉన్నారు. పెళ్లికూతుళ్లు దొరకుకుండా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విడుదలైన ఉత్తరాది రాష్ట్రాల్లో లింగనిష్పత్తి దారుణంగా ఉందని, తమిళనాడులో కూడా తగ్గుతోందని తెలిసింది. తమిళనాడులో ఇంతకుముందు వెయ్యి మంది అబ్బాయిలకు 927 మంది అమ్మాయిలు పుడితే, ఇప్పుడు 921 మందే పుట్టారు. అంతర్జాతీయంగా చూస్తే ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 950 లేదా అంతకంటే ఎక్కువ మంది అమ్మాయిలు పుడుతున్నారు. 
 
2011-13 సంవత్సరాల మధ్య ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 909 మంది అమ్మాయిలు పుడితే, 2012-14 మధ్య ఈ సంఖ్య మరింత తగ్గి 906కు చేరుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో 887 మంది పుడితే, ఇప్పుడు 876 మందే పుట్టారు. తర్వాతి స్థానంలో యూపీ ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''నా న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తా.. నీ నగ్న చిత్రాల్ని పంపు''.. ఎఫ్‌బీతో మోసం