Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1995లో నిజాం ఆభరణాల విలువ రూ.218 కోట్లు.. ఇప్పుడో.. రూ.50 వేల కోట్లు

1995లో భారత ప్రభుత్వం నిజాం ట్రస్టు నుంచి ఆనాటికి 218 కోట్ల రూపాయల విలువైన 173 నిజాం ఆభరణాలను హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని ఆర్బీఐ లాకర్‌‌కి తరలించింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత వాటి విలువు నేడు 50 వేల కోట్లకు పెరిగింది. హైదరాబాద్ చరిత్రలో అతి ముఖ్యమై

Advertiesment
1995లో నిజాం ఆభరణాల విలువ రూ.218 కోట్లు.. ఇప్పుడో.. రూ.50 వేల కోట్లు
హైదరాబాద్ , శనివారం, 8 ఏప్రియల్ 2017 (08:07 IST)
గత గురువారం హైదరాబాద్ చివరి నిజాం 131వ జయంతి. ఈ సందర్బంగా డిల్లీలోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ లాకర్‌లో ఉంచిన 173 అమూల్యమైన నిజాం ఆభరణాలపైకి అందరి దృష్టీ మరోసారి వెళ్లింది. ఆ నిధిని మళ్లీ హైదరాబాద్‌కి తీసుకువచ్చేందుకు నిజాం కుటుంబం తమ సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. 
 
1995లో భారత ప్రభుత్వం నిజాం ట్రస్టు నుంచి ఆనాటికి 218 కోట్ల రూపాయల విలువైన 173 నిజాం ఆభరణాలను హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని ఆర్బీఐ లాకర్‌‌కి తరలించింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత వాటి విలువు నేడు 50 వేల కోట్లకు పెరిగింది. హైదరాబాద్ చరిత్రలో అతి ముఖ్యమైన ఈ ఆభరణాలకు నగర ప్రజలు దూరం కావడం దురదృష్టకరమైన పరిణామమని ఏడవ నిజాం ముని మనవడు హిమాయత్ ఆలి మీర్జా విచారం వ్యక్తం చేశారు.
 
చివరి నిజాం వారసత్వంపై మేధావులు హైదరాబాద్‌లో అన్వేషిస్తుంటే, నగర ప్రజలు మాత్రం నిజాం ఖజానాను 2001లో 2006లో రెండుసార్లు చూసే భాగ్యం పొందారు. సాలార్ జంగ్ మ్యూజియంలో అప్పట్లో స్వల్పకాలంపాటు నిజా ఖజానాను ప్రజల సందర్సనార్థం ఉంచారు. ఆ ఖజానా తిరిగి ఆర్బీఐ వాల్ట్‌లలోకి పంపేముందు లక్షలాది మంది సందర్శకులు వాటిని సందర్శించారు. 
 
చివరి నిజాం మునిమనవడు హిమాయత్ ఆలి మీర్జా ఢిల్లీలో ఉన్న నిజాం ఆభరణాలను హైదరాబాద్‌కు తిరిగి తెచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి చర్చిస్తామని చెప్పారు. నిజా ఆభరణాలను ప్రదర్సించడానికి హైదరాబాద్ తన సొంత మ్యూజియంని తప్పక కలిగి ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. హిమాయత్ తల్లి ఫాతిమా ఫౌజియా అయితే నిజాం ఆభరణాలను హైదరాబాద్‌కు తెచ్చేందుకు తాము సుప్రీంకోర్టుకైనా సరే వెళతామని చెబుతున్నారు. 
 
నిజాం వారసుల ఉద్దేశాలను కొంతమంది అనుమానిస్తున్నప్పటికీ వారు మాత్రం ఈ విషయమై తామంతా ఒక్కటిగానే ఉన్నామని చెప్పారు. నిజాం కుటుంబంతోపాటు చాలామంది ఇక్కడి చరిత్రకారులు, నగర వయో వృద్దులు కూడా ఇలాగే అభ్యర్థస్తున్నారు. ఆ ఆభరణాలను భారత ప్రభుత్వ ఆస్థిగానే గుర్తిద్దాం. కానీ ఆ అభరణాలు హైదరాబాద్‌కే చెందాలి అని వారంటున్నారు. 
 
చివరి నిజాం ఆభరణాలను నగరంలోనే శాశ్వతంగా సందర్సనకు ఉంచితే వాటిని చూడటానికి భారత్ నుంచి, విదేశాల నుంచి వేలాదిమంది సందర్శకులు వస్తారని, వీరంటున్నారు. అవి  ప్రత్యేకమైనవి. బ్యాంకు వాల్టులో వాటిని అలా మూసి ఉంచకూడదని వీరి అభిప్రాయం. 
 
ది లాస్ట్ నిజాం పుస్తక రచయిత జాన్ జుబ్రజికి అయితే హైదరాబాద్‌ను ఆభరణాలకు సహజ నెలవుగా పేర్కొన్నాడు. వాటిని హైదరాబాద్‌కు తిరిగి తేవలసిన అవసరం ఉందన్నాడు. నిజాం ఆభరణాలు హైదరాబాద్ గత చరిత్రకు నమూనా కాబట్టి ప్రజలు తమ చరిత్ర గురించి తెలుసుకోవలసిన అవసరముందని జాన్ అంటున్నారు.
 
హైదరాబాద్ రాజస్తాన్ కంటే ఆకర్షణీయమైనదే అయినప్పటికీ నిజాం పాలన ముగిసిన 50 ఏళ్లలోపే నగర చరిత్రను ధ్వంసం చేశారని ప్రముఖ రచయిత, చరిత్రకారుడు విలయం డార్లింపుల్ ఆవేదన వ్యక్తం చేశారు. చౌమాహల్లా, ఫలక్‌నామా తప్పితే నగర వైభవాన్ని విస్తరించేందుకు ఎవరూ ఏమీ చేయలేదని అన్నారు. నిజాం ఆభరణాలను ఉంచాల్సిన చోటు హేైదరాబాదే అని ఈయనా అంటున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామసుబ్బారెడ్డి సౌమ్యుడే.. కానీ అనుచరులో.. సిఎం రమేష్ బాగానే రుచి చూశారు