ఇంకా న్యాయం జరగలేదు.. ఓటు వేసే ప్రసక్తే లేదు: నిర్భయ తల్లిదండ్రులు
నిర్భయ కేసులో తీర్పు వచ్చినా.. ఇంకా న్యాయం మాత్రం జరగలేదని.. నిర్భయ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇందుకు నిరసనగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము ఓటు వేసేది లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగ
నిర్భయ కేసులో తీర్పు వచ్చినా.. ఇంకా న్యాయం మాత్రం జరగలేదని.. నిర్భయ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇందుకు నిరసనగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము ఓటు వేసేది లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నిర్భయ మరణ వాంగ్ములాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధ్రువీకరించి.. దోషులకు గతేడాది ఉరిశిక్షను ఖరారు చేసింది. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు బస్సులో నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా విడుదలయ్యాడు.
ఈ నేపథ్యంలో తమ కుమార్తె మృతికి కారణమైన మృగాళ్లకు సంబంధించిన తీర్పు కాగితాలకే పరిమితమైందని నిర్భయ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాన ప్రచారకర్తగా ఉన్న ప్రధాని మోదీ.. నిర్భయను ఓసారి గుర్తుచేసుకోవాలన్నారని.. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసేది లేదని.. ఇకపై ఎవరిపైనా ఆశలు, నమ్మకం తనకు లేవంటూ వ్యాఖ్యానించారు.
సరిగ్గా ఏడాది క్రితం సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును స్వాగతించాం. అయితే శిక్ష మాత్రం అమలు కావట్లేదని.. న్యాయం జరగడానికి ఇంకెన్నాళ్లు పడుతుందోనని నిర్భయ తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. మా కూతురుని కోల్పోయి ఆరేళ్లు గడిచింది. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు ఎన్ని తెచ్చినా కథువా, ఉన్నావ్ వంటి ఘటనలు జరుగుతూనే వున్నాయని నిర్భయ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.