Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్భయ కేసు.. నిందితులు పిన్న వయస్కులట.. ఉరితీయకూడదట.. అత్యాచారం, హత్య చేసినప్పుడు?

2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య ఘటనలో నిందితులైన ముకేశ్‌(24), పవన్‌(20), వినయ్‌(22), అక్షయ్‌(29)లకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. నిందితులు దీన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించగా, దోష

Advertiesment
Nirbhaya case: SC to hear convicts' plea challenging death sentence
, బుధవారం, 16 నవంబరు 2016 (09:13 IST)
2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య ఘటనలో నిందితులైన ముకేశ్‌(24), పవన్‌(20), వినయ్‌(22), అక్షయ్‌(29)లకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. నిందితులు దీన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించగా, దోషులు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిర్భయ గ్యాంగ్‌రేప్‌, హత్యోదంతంలో మరణశిక్ష పడి ప్రస్తుతం జైల్లో ఉన్న నలుగురు ఖైదీలను ఉరితీయరాదని ఈ కేసులో కోర్టుకు సహాయకుడుగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ జడ్జిలను అభ్యర్థించారు.
 
వారింకా చిన్నవాళ్లే.. ఉరితీయదగిన వయస్సు కూడా కాదని పేర్కొంటూ సుప్రీంలో లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. శిక్షపడిన వారు పిన్న వయస్కులు కావడంతో వారికి నేర నేపథ్యం లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ దోషుల పట్ల సానుకూల వైఖరితో చూడాలని రామచంద్రన్‌ కోరారు. అయితే నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 
 
యువతిపై అమానుషంగా, పైశాచికంగా అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసిన వారిని వదిలిపెట్టకూడదని, అత్యాచారం, హత్య వంటి నేరాలకు పాల్పడిన వారిని చిన్నాపెద్దా లేకుండా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. న్యాయవాదులు న్యాయాన్ని పరిరక్షించాల్సిందిపోయి.. హత్య, అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయకూడదంటూ కోర్టును విజ్ఞప్తి చేయడం సబబు కాదని.. కఠినమైన శిక్షలుంటేనే నేరాలు తగ్గుతాయని మహిళా సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బిచ్చగాడు' వేషంలో వచ్చాడు.. బ్యాగులో నుంచి రూ.50 లక్షల నోట్ల కట్టలు తీశాడు...