తుపాకీతో బెదిరించి కొత్త పెళ్లి కుమార్తెపై భర్త.. స్నేహితుల గ్యాంగ్ రేప్
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కొత్త పెళ్లి కుమార్తెపై కట్టుకున్న భర్తతో పాటు.. అతని స్నేహితులు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కొత్త పెళ్లి కుమార్తెపై కట్టుకున్న భర్తతో పాటు.. అతని స్నేహితులు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
జార్ఖండ్ రాష్ట్రం పల్మావు జిల్లాలోని రహయ్యా అనే మారుమూల గ్రామంలో అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తికి ఇటీవలే వివాహమైంది. ఈ నవ దంపతులను చూసేందుకు ఓ రోజున అతని స్నేహితులు బబ్లూ సింగ్, అఫ్జల్ మియాలు అన్సారీ ఇంటికి వచ్చారు. వారికి ఆ కొత్త పెళ్లికుమార్తె సపర్యలు కూడా చేసింది. అయితే, వాటిని పీకల వరకు ఆరగించిన ఆ కామాంధులు.. ఆమెపై కన్నేశారు.
తన స్నేహితులు అడిగిన కోర్కెను తీర్చేందుకు ఆ కిరాతక భర్త కూడా సమ్మతించాడు. దీంతో తొలుత భార్యపై భర్త అత్యాచారం చేసి.. తర్వాత తన స్నేహితులతో కూడా చేయించాడు. అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారాన్ని అన్సారీయే స్వయంగా వీడియో తీసి.. ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడు.
తర్వాతి రోజు ఉదయం ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని.. తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే స్థానిక పోలీసు అధికారి మాత్రం కేసు పెట్టకుండా వాళ్లను వెనక్కి పంపేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేయించినట్లు డీఎస్పీ రవి చెప్పారు.