కరవు ప్రాంతాల్లో వాతావరణ మార్పులను తట్టుకుని పండే 3 రకాల శనగ వంగడాలను విడుదల చేసింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థలతో కలిసి వీటిపై పరిశోధనలు చేసి సత్ఫలితాలు సాధించింది.
ఈ విత్తనాలు పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాల భూముల్లో పండేరకాలని స్పష్టం చేసింది. ఈ 3 రకాల విత్తనాల పేర్లు బీజీఎం-4005, ఐపీసీఎల్4-14, ఐపీసీఎంబీ19-3. వీటి పంట సాగు కాలం 106 నుంచి 133 రోజులు. ఐపీసీఎల్4-14 రకం పంట హెక్టారుకు 16 క్వింటాళ్లు, బీజీఎం-4005 హెక్టారుకు 17, ఐపీసీఎంబీ19-3 రకం పంట 21 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఎన్నో ఏళ్లుగా రైతులు పండిస్తున్న పాత రకాల విత్తనాల్లో జన్యువుల మార్పిడి ద్వారా కొత్త వంగడాలను సృష్టించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వీటిని పండించగా.. పాత వంగడాలకన్నా 11 నుంచి 14.76 శాతం అధిక దిగుబడి వచ్చిందని ఐసీఏఆర్‌కు చెందిన శాస్త్రవేత్త వివరించారు.