Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వామి వివేకానందకు ఆంగ్లంలో అత్తెసరు మార్కులే... ఫ్రెంచ్ వంటలంటే మక్కువట!

స్వామి వివేకానంద. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో తన అనర్గళ ఆంగ్ల ప్రసంగంలో భారతీయ తాత్వికచింతన, సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని వివరించి మంత్రముగ్ధులను చేసిన గొప్ప ఆధ్యాత్మికవేత్త. అయితే, ఈయన పాఠశ

స్వామి వివేకానందకు ఆంగ్లంలో అత్తెసరు మార్కులే... ఫ్రెంచ్ వంటలంటే మక్కువట!
, సోమవారం, 9 జనవరి 2017 (06:28 IST)
స్వామి వివేకానంద. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో తన అనర్గళ ఆంగ్ల ప్రసంగంలో భారతీయ తాత్వికచింతన, సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని వివరించి మంత్రముగ్ధులను చేసిన గొప్ప ఆధ్యాత్మికవేత్త. అయితే, ఈయన పాఠశాల దశలో ఇంగ్లీషు సబ్జెక్టులో అత్తెసరు మార్కులే వచ్చాయట. 
 
ఈ విషయాన్ని ప్రముఖ రచయిత హిందోల్‌సేన్ గుప్తా వెల్లడించాడు. ఈయన తన తాజా పుస్తకం ''మోడ్రన్‌ మాంక్‌: వాట్‌ వివేకానంద మీన్స్‌ టు అజ్‌ టుడే''లో వివేకానందుని జీవితంలోని కొత్త కోణాలను వెల్లడించారు. అందులోని అంశాలను పరిశీలిస్తే.. 
 
వివేకానంద విద్యార్థిగా ఉన్నప్పుడు ఆంగ్ల సబ్జెక్టులో సాధారణ స్థాయి మార్కులే వచ్చాయి. న్యాయవాది ఇంట పుట్టిన వివేకానందుడు కోల్‌కతాలోని ప్రసిద్ధ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించారని, అందువల్లే బ్రిటీష్‌ వారి మాదిరిగా ఆంగ్లంలో రాయగలిగారని, మాట్లాడగలిగారని సేన్‌గుప్తా తెలిపారు.
 
అయితే, వివేకానందుని విద్యార్హత పత్రాల్లోని ఆంగ్ల మార్కులను చూస్తే ఇంతటి ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయని భావించలేమని రచయిత పేర్కొన్నారు. ఫస్ట్‌ స్టాండర్డ్‌(ఎఫ్‌ఏ-ఆ తర్వాత ఇంటర్మీడియట్‌ ఆర్ట్స్‌గా మారింది), బీఏలోని ఆంగ్లభాష సబ్జెక్టులలో వివేకానందునికి వరుసగా 46, 56 మార్కులేవచ్చాయని, ప్రవేశపరీక్షలో 47 మార్కులు మాత్రమే వచ్చాయని వెల్లడించారు.
 
అలాగే, ''గణితం, సంస్కృతంలోనూ ఇవే స్థాయిలో మార్కులు వచ్చేవి. ఫ్రెంచ్‌ వంటల పుస్తకాలంటే మక్కువ. కొత్త పద్ధతిలో కిచిడీ తయారీ... నౌకానిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం వంటివి వివేకానందుడు ఇష్టపడే ఇతర అంశాల''ని రచయిత పుస్తకంలో వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావోయిస్టుల నడ్డి విరిచిన పెద్దనోట్ల రద్దు