Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మావోయిస్టుల నడ్డి విరిచిన పెద్దనోట్ల రద్దు

పెద్ద నోట్ల రద్దు కోట్లాదిమంది భారతీయులను ఎన్ని వెతలకు గురిచేసిందో మనందరకూ తెలుసు. కానీ సామాన్యప్రజల మాటేమిటో కానీ మావోయిస్టుల ఆర్థికమూలాలను పెద్దనోట్ల రద్దు చిన్నాభిన్నం చేసిందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా ఇప్పుడైనా మావోయిస్టులు హింసామార్

మావోయిస్టుల నడ్డి విరిచిన పెద్దనోట్ల రద్దు
హైదరాబాద్ , సోమవారం, 9 జనవరి 2017 (05:41 IST)
పెద్ద నోట్ల రద్దు కోట్లాదిమంది భారతీయులను ఎన్ని వెతలకు గురిచేసిందో మనందరకూ తెలుసు. కానీ సామాన్యప్రజల మాటేమిటో కానీ మావోయిస్టుల ఆర్థికమూలాలను పెద్దనోట్ల రద్దు చిన్నాభిన్నం చేసిందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా ఇప్పుడైనా మావోయిస్టులు హింసామార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలంటూ పిలుపునిచ్చింది కూడా.
 
వామపక్ష అతివాద బృందాలు ఇప్పటికైనా హింసను వదిలిపెట్టాలని, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ పేర్కొన్నారు. జార్కండ్ రాష్ట్రంలో మావోయిస్టు తీవ్రవాదం పరిస్థితిని సమీక్షించిన సందర్భంలో రాజనాథ్ ఇలా మావోయిస్టులకు హితవు చెప్పడం విశేషం. 
 
పెద్దనోట్ల రద్దు తర్వాత మావోయిస్టుల ఆర్థిక మూలాలు క్రక్కదిలిపోయాయని, కేంద్రప్రభుత్వం మావోయిస్టులను ఈ రూపంలో బాగా దెబ్బతీసిందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. మావోయిస్టు సమస్యను కొన్నేళ్లలో పూర్తిగా పరిష్కరిస్తామని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ఇప్పుడు సైబర్ టెర్రరిజం ప్రబలుతోందని, హ్యాకింగ్ అతి పెద్ద ప్రమాదంగా ఏర్పడనుందని రాజనాథ్ పేర్కొన్నారు. కేంద్ర బలగాలు సైబర్ దాడులపై పోరుకు కూడా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో ఆర్థికమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ మావోయిస్టుల వద్ద రూ. 1,500 కోట్లు మూలుగుతున్నాయని 1993లో పేర్కొన్నట్లు గుర్తు. అంతకు ముందు నాటి పీపుల్స్ వార్ ప్రధాన కార్యదర్సి గణపతి ఒక ఇంటర్వ్యూలో తమ వద్ద బోలెడు డబ్బు ఉందని, దాన్ని దాచుకోవడమే సమస్య అనీ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అప్ప్టట్లో తీవ్ర ఆర్థిక సంక్షేభంలోఉండేది. గణపతి ప్రకటన నేపథ్యంలో ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ మావోయిస్టులనే అప్పు అడుగుతున్నట్లు నాటి పత్రికలలో వచ్చిన కార్టూన్లు జనాలను బాగా నవ్వించాయి. 
 
పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్టు పార్టీగా పేరు మార్చుకున్నాకి దాని ఆదాయ వనరులు అమాంతంగా పెరిగాయని. 2015 నాటికి వారి వద్ద రూ. 7,500 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, బంగారు సమకూరిందని జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థ అప్పట్లో ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వారు డంప్ చేసిన పెద్ద మొత్తాలు ఉపయోగంలోకి రాకుండా పోయాయి. ఊహించని కోణం నుంచి తగిలిన ఈ దెబ్బకు మావోయిస్టు పార్టీ తట్టుకుంటుందా లేదా అనేది భవిష్యత్తు తేల్చాల్సిన విషయం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమ్ల వర్షం కాదు.. అది మలవర్షం