Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేతాజీ తైవాన్ విమాన ప్రమాదంలోనే చనిపోయారు: నిర్ధారించిన కేంద్రం

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నిన్నటివరకు అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే కేంద్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపట్ల కీలక ప్రకటన చేసింది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 1945లో తైవాన్‌లో

నేతాజీ తైవాన్ విమాన ప్రమాదంలోనే చనిపోయారు: నిర్ధారించిన కేంద్రం
, బుధవారం, 31 మే 2017 (17:00 IST)
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నిన్నటివరకు అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే కేంద్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపట్ల కీలక ప్రకటన చేసింది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని కేంద్రం నిర్ధారించింది. 
 
షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్ సమర్పించిన నివేదికల ఆధారంగా భారత సర్కారు ఈ నిర్ధారణకు వచ్చింది. ఆర్టీఐ చట్టం కింద ఓ వ్యక్తి దాఖలు చేసిన దరఖాస్తుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతాజీ తైవాన్ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు తెలిపింది. నేతాజీ మృతికి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని డీక్లాసిపై చేసిన హోంశాఖ, ఈ విషయాన్ని వివరంగా పేర్కొంది.
 
కానీ నేతాజీ కుటుంబం దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది బాధ్యతా రాహిత్యమని, నేతాజీ మృతిపై పటిష్టమైన ఆధారాలు లేనిదే ఆయన విమాన ప్రమాదంలో ఎలా మరణించారని నిర్ధారిస్తారని నేతాజీ దగ్గర బంధువు, బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చంద్రబోస్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
 
కాగా అక్టోబర్ 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నేతాజీ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. నేతాజీ మృతిపై 70 ఏళ్ల పాటు నెలకొన్న మిస్టరీని చేధించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గత ఏడాది 2016న నేతాజీ 119వ జయంతిని పురస్కరించుకుని జనవరి 23వతేదీ నేతాజీకి సంబంధించిన 100 రహస్య పత్రాలను మోడీ ప్రజల కోసం బహిర్గతం చేశారు. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్ తైవాన్ ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు నివేదికలు ఇవ్వగా, జస్టిస్ ముఖర్జీ కమిషన్ మాత్రం నేతాజీ బతికే వున్నట్లు పేర్కొంది. 
 
ప్రస్తుతం ఇదే విషయాన్ని నేతాజీ దగ్గర బంధువు చంద్రబోస్ కూడా లేవనెత్తారు. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని ముఖర్జీ కమిషన్ స్పష్టంగా చెప్పిందని, ఆయన చైనాకుగానీ రష్యాకుగానీ వెళ్లివుండవచ్చని పేర్కొందని, పైగా ఈ కమిషన్ నివేదికను కాంగ్రెస్ తోసిపుచ్చిందని చంద్రబోస్ గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ దొంగ 14వేల ఫైళ్లను దొంగలించాడట.. గూగుల్ కోర్టు కెళ్లింది.. ఉబెర్ ఏం చేసిందంటే?