Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

Advertiesment
neet 2025

ఠాగూర్

, సోమవారం, 5 మే 2025 (13:07 IST)
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2025 (యూజీ) పరీక్ష దేశ ప్రశాంతంగా జరిగింది. అయితే, ఈ యేడాది ఫిజిక్స్ విభాగంలోనే ప్రశ్నలు అత్యంత కఠినంగా రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిర్ధేశిత వ్యవధిలో సమాధానాలు గుర్తించడం సవాలుగా మారిందని పలువురు అభ్యర్థులు వాపోయారు. ప్రశ్నల సరళి జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉందని నీట్ చరిత్రో ఫిజిక్స్ ఇంత కఠినంగా రావడం ఇదే మొదటిసారని కోచింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
 
బయాలజీ విభాగంలో బోటనీ నుంచి 50 ప్రశ్నలు అడిగారు. ఈ సబ్జెక్టులపై మంచిపట్టున్న వారికి ఇది ప్రయోజనకరంగా మారింది. రీజన్ అండ్ అసెర్షన్, మ్యాచింగ్ తరహా ప్రశ్నలు అధికంగా ఇచ్చారు. చాలా ప్రశ్నలు మధ్యస్థాయి కఠినత్వంతో ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. జువాలజీలో రీప్రొడక్షన్ హెల్త్‌కు సంబంధించిన ఒక ప్రశ్న ఎన్.సి.ఆర్.టి సిలబస్ పరిధిలో లేదని కొందరు చెబుతున్నారు. మొత్తంగా బయాలజీలో 40కి పైగా ప్రశ్నాలకు సమాధానాలు గుర్తించగలిగామని కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. కెమిస్ట్రీలో విభాగంలో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉండగా గమనార్హం. ముఖ్యంగా, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్నలు కొంత కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?