#NDTVBanned రెండు రోజులు... ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ కాదు... ఇవి కూడా చూడండి...
ప్రముఖ జాతీయ చానెల్ ఎన్డీటీవీ ప్రసారాలను రెండు రోజుల పాటు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసారాల నియమాలను ఉల్లంఘనే ఇందుకు కారణమని తెలుస్తోంది. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ ఉగ్ర దాడి సమయంలో బేస్ లోని కీలక ప్రదేశాలను టీవీలో ప్రసారం చేయడంతో క
ప్రముఖ జాతీయ చానెల్ ఎన్డీటీవీ ప్రసారాలను రెండు రోజుల పాటు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసారాల నియమాలను ఉల్లంఘనే ఇందుకు కారణమని తెలుస్తోంది. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ ఉగ్ర దాడి సమయంలో బేస్ లోని కీలక ప్రదేశాలను టీవీలో ప్రసారం చేయడంతో కేంద్ర ప్రసారాల శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 9, 10 తేదీల్లో ఎన్డీటీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి.
కాగా దీనిపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రతిపక్షాలను జైల్లో పెట్టడం, మీడియా గొంతులను నొక్కేయడం ప్రధానమంత్రి మోదీ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. దీనిపై ఆర్ఎస్ఎస్ కౌంటర్ వేసింది. ఇదేమీ మొదటిది కాదనీ, ఇంతకుముందు అభ్యంతరకరమైన ప్రసారాలను చేసినప్పుడు ఇలాంటి చర్యలు చాలానే జరిగాయంటూ ఓ లిస్టును ట్విట్టర్లో పోస్ట్ చేసింది.