Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జల్లికట్టు'కు సై... మెరీనా బీచ్ వద్ద ప్రజల ఆందోళన.... ద్రవిడదేశం సంపూర్ణ మద్దతు

జల్లికట్టు ఘోరం అంటూ నటి త్రిష 'పెటా' తరపున సుప్రీంకోర్టులో పిల్ వేసి జల్లికట్టు ఆటకట్టు చేసిన నేపధ్యంలో తమిళనాడులో నిరసన సెగలు రేగిన సంగతి తెలిసిందే. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపధ్య

'జల్లికట్టు'కు సై... మెరీనా బీచ్ వద్ద ప్రజల ఆందోళన.... ద్రవిడదేశం సంపూర్ణ మద్దతు
, బుధవారం, 18 జనవరి 2017 (17:00 IST)
జల్లికట్టు ఘోరం అంటూ నటి త్రిష 'పెటా' తరపున సుప్రీంకోర్టులో పిల్ వేసి జల్లికట్టు ఆటకట్టు చేసిన నేపధ్యంలో తమిళనాడులో నిరసన సెగలు రేగిన సంగతి తెలిసిందే. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపధ్యంలో తమ సంప్రదాయ క్రీడపై నిషేధం ఎత్తివేయాలంటూ తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. చెన్నైలోని మెరీనా బీచ్‌లో వేలాది సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఆందోళ‌న చేస్తున్నారు. మరోవైపు సినీ నటి నయనతార జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టుకు తన విన్నపమంటూ పేర్కొన్నారు. 
 
అంతకుముందే కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరూ కూడా జల్లికట్టు క్రీడ తమిళనాడు సంప్రదాయ క్రీడ కనుక ఆ దృష్టితో చూడాలని విజ్ఞప్తి చేశారు. మొత్తమ్మీద తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు క్రీడ కోసం భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. ఐతే జల్లికట్టు వల్ల పశువులకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా ఆ క్రీడా సమయంలో పలువురు యువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు ఈ క్రీడపై నిషేధం విధించింది.
webdunia


మరోవైపు.. జల్లికట్టు పోటీలకు చెన్నైలోని ద్రావిడ దేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులోభాగంగా, ఆ పార్టీ అధినేత కృష్ణారావు మాట్లాడుతూ.. జల్లికట్టు తమిల గ్రామీణ సంప్రదాయ క్రీడ అని, దాన్ని నిర్వహించకుండా అడ్డుకోవడం ఏమాత్రం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. పెటా సంస్థ కోర్టుకు ఆశ్రయించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుడా, చెన్నై మెరీనా తీరంలో జల్లికట్టు కోసం, పెటాకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు చేస్తున్న ఆందోళనకు ఆయన స్వయంగా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండా సురేఖ గొంతు వినిపించింది.. హిజ్రాలపై నోరెత్తారు.. పెన్షన్ ఇవ్వాలని డిమాండ్..