Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోనియా - రాహుల్‌కు ఐటీ నోటీసులు.. రాజకీయ కక్షతోనా..?

Advertiesment
సోనియా - రాహుల్‌కు ఐటీ నోటీసులు.. రాజకీయ కక్షతోనా..?
, బుధవారం, 9 జులై 2014 (16:22 IST)
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఆదాయపు పన్ను శాఖ కాగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై సోనియా సోమవారం స్పదించారు. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సోనియాతప్పుబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ శాఖ తనకు నోటీసులు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. 
 
ఇలాంటి చర్యలతో తాము త్వరగా పుంజుకునే అవకాశం ఉందని, తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలతో తమను ఎవరూ భయపెట్టలేరని, ఇలాంటి చర్యలకు బెదరబోమని ఆమె స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ ఆధారంగా పోయిన నెలలో ఇదే కేసులో సోనియా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ స్థానిక కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu