Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌ మాస్కులు - ఫేస్‌కవర్లు ధరించడం ఓ భాగం కావొచ్చు : నరేంద్ర మోడీ

Advertiesment
ఫేస్‌ మాస్కులు - ఫేస్‌కవర్లు ధరించడం ఓ భాగం కావొచ్చు : నరేంద్ర మోడీ
, సోమవారం, 27 ఏప్రియల్ 2020 (19:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లోభాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఫేస్‌ మాస్కులు, ఫేస్ కవర్లు ధరించడం మన జీవితంలో భాగం కావొచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు, కోవిడ్-19పై పోరాటం సాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 
 
దేశంలో కోవిడ్-19 ప్రస్తుత పరిస్థతి, సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియా కాన్ఫరెన్స్‌లో మోడీ చర్చించారు.
 
ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మోడీ మాట్లాడుతూ, "ఇంతవరకూ మనం రెండు లాక్‍డౌన్లు చూశాం. ప్రస్తుతం మనం ఏవిధంగా ముందుకు వెళ్లాలనేది ఆలోచించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా వైరస్ ప్రభావం రాబోయే నెలల్లోనూ కనిపిస్తుంది. మునుముందు కూడా రోజువారీ జీవితంలో అంతా మాస్క్‌లు ధరించడం అనివార్యం కావచ్చు" అని మోడీ అన్నారు. 
 
లాక్‌డౌన్‌తో సానుకూల ఫలితాలు వచ్చాయని, గత నెలన్నరగా వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగామని మోడీ చెప్పారు. పలు దేశాల జనాభా అంతా కలిపితే ఎంతో భారత్ జనాభా అంతని అన్నారు. మార్చి ప్రారంభంలో ఇండియాతో సహా చాలా దేశాల్లో పరిస్థితి దాదాపు ఒకేలా ఉందని చెప్పారు.
 
'ప్రస్తుత పరిస్థిత్లో ప్రతి ఒక్కరూ శీఘ్రగతిన స్పందించడం ముఖ్యం. చాలా మంది ప్రజలు దగ్గు, జలులు, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందిస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం' అని ప్రధాని అన్నారు. హాట్‌స్పాట్‌లు, రెడ్‌స్పాట్‌లో విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలని కూడా ముఖ్యమంత్రులకు మోడీ సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్‌ విముక్త ప్రాంతంగా ఈశాన్య భారత్?!