Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆట మొదలైంది... అప్పుడే ఏమైంది? ముందుంది మొసళ్ళ పండగ... విపక్షాలకు నరేంద్ర మోడీ వార్నింగ్!

దేశంలోని విపక్ష పార్టీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో ఆట మొదలైందని.. అపుడే ఏమైంది.. అసలు కథ ముందుంది అంటూ వ్యాఖ్యానించారు. పైగా తాము ఎలాంటి హా

Advertiesment
Narendra Modi
, బుధవారం, 23 నవంబరు 2016 (08:41 IST)
దేశంలోని విపక్ష పార్టీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో ఆట మొదలైందని.. అపుడే ఏమైంది.. అసలు కథ ముందుంది అంటూ వ్యాఖ్యానించారు. పైగా తాము ఎలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామో గుర్తుకు తెచ్చుకోవాలంటూ సొంత పార్టీ ఎంపీలకు కూడా ఆయన హితబోధ చేశారు. 
 
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడుతూ "ఆట ఇప్పుడే మొదలైంది... పేదల అభ్యున్నతి కోసం పాటు పడతామని హామీ ఇచ్చే ఎన్నికల్లో పోటీ చేశాం... గెలిచాం... మరి ఇప్పుడు పేదల కోసం ఏమీ చేయకపోతే ఎలా? పేదల కోసం ఎంతకైనా తెగిస్తా.... నల్లధనాన్ని రూపు మాపడానికి ఎంతటి చర్యలనైనా తీసుకుంటాం... పెద్ద నోట్ల రద్దు అంశం చాలా చిన్న విషయం... అసలు కథ ముందుంది... ఇంకా చాలా చర్యలు తీసుకోబోతున్నాం... అసలు ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఆశ్చర్యపడాలే కానీ... తీసుకుంటే ఆశ్చర్యం ఎందుకు?" అంటూ కాస్తంత భావోద్వేగంతో మాట్లాడారు. 
 
అంతేకాకుండా, "మనం ఎందుకు అధికారంలోకి వచ్చామో అందరూ గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీనీ నెరవేర్చాల్సిందే.... పెద్ద నోట్ల రద్దును సామాన్య ప్రజలు ఆహ్వానిస్తున్నారు. నల్లధనం నుంచి దేశాన్ని ప్రక్షాళన చేయడానికి క్యూలైన్లలో నిలబడి పేద ప్రజలు మద్దతును తెలియజేస్తున్నారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. మీరు వారిని పట్టించుకోకండి. ప్రతిపక్షాలను ప్రతిస్థాయిలో ఎండగట్టి ప్రజలకు నిజానిజాలు చెప్పండి" అంటూ పార్టీ ఎంపీలకు హితబోధ చేశారు. 
 
దేశ క్షేమం కోరే ప్రతిపక్షాలు లోటుపాట్లను ఎత్తిచూపి పరిష్కార మార్గాలు చూపితే బావుంటుందని, సరైన సలహాలు సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని మోడీ తెలిపారు. 'రాజకీయాల్లో విలువలు అంతరించి పోతున్నాయి. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లే నిస్సిగ్గుగా అవినీతికి, నల్లధనానికి మద్దతు పలుకుతూ ప్రసంగాలు చేస్తున్నారు' అని ప్రధాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "ఏ దేశంలోనైనా విలువలు లుప్తం కావడమే అతి పెద్ద సంక్షోభం" అన్నారు. 'విలువలకు పాతరేస్తున్న నేతలను భావితరాల వాళ్లు క్షమించరు' అంటూ హెచ్చరిక చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టిసీమకే కాదు పులివెందులకు కూడా నీళ్ళు తీసుకొచ్చా