ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని కాగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటికే ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలను పూర్తి విక్రయానికి కేంద్రం నిర్ణయించిందని వచ్చిన వార్తలపై రాహుల్ సోమవారం ఘాటుగా స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భాజపాకు ఎలా నిర్మించాలో తెలియదు గానీ, ఎలా అమ్మాలో మాత్రం పూర్తి అవగాహన ఉందంటూ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. మోడీ ఆప్తమిత్రులు మాత్రమే లబ్ధి పొందుతారని విమర్శించారు. #IndiaAgainstPrivatisation అనే హ్యష్‌ట్యాగ్ జోడించారు.
అనేక అంశాలపై ప్రధాని మోడీ సర్కారును రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబడుతున్న విషయం తెల్సిందే. ఇపుడు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ఆయన రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.