Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్‌ను ఫాలో అవుతున్న నరేంద్ర మోడీ.. నెలకి పదిలక్షలు సంపాదిస్తున్న వారు ఎక్కువేనట..

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారోనని చర్చసాగింది. తాజాగా షాకింగ్ నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు అనీ సాధారణ నిర్ణయాల గురించే మోడీ

పవన్ కల్యాణ్‌ను ఫాలో అవుతున్న నరేంద్ర మోడీ.. నెలకి పదిలక్షలు సంపాదిస్తున్న వారు ఎక్కువేనట..
, ఆదివారం, 1 జనవరి 2017 (10:20 IST)
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారోనని చర్చసాగింది. తాజాగా షాకింగ్ నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు అనీ సాధారణ నిర్ణయాల గురించే మోడీ మాట్లాడారు. మోడీ చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు నిజంగా షాకింగ్‌గా ఉన్నాయి. ఈ దేశంలో అప్రకటితంగా నెలకి పదిలక్షలు సంపాదిస్తున్న వారు ఇరవై నాలుగు లక్షల మంది పైనే ఉన్నారని మోడీ బాంబు వేశారు. 
 
దేశంలో నీతి నిజాయితీ పెరిగితీరాల్సిన తరుణం ఇదేనని.. తప్పుడు లెక్కలు చూపించే రోజులు పోతే గానీ దేశం బాగుపడదని మోడీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల నిర్ణయం దేశానికి ఇబ్బంది కలిగించినా సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. విపక్షాల ఆందోళనలు అన్నీ అబద్ధం అనీ ఈ ఏడాది ఆరు శాతం రబీ సాగు పెరిగిందని గుర్తు చేశారు. ఎరువుల కొనుగోళ్ళు 9 శాతం పెరిగాయన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యవసాయం దివాలా తీసిందని రాహుల్ గాంధీ తదితరులు చేసిన ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చారు. 
 
ఇంతటి వనరులు ఉన్న దేశానికి అవినీతి , నల్లదనం ఈ రెండే అడ్డంగా ఉన్నాయి అనీ అందుకే దానిమీద యుద్ధం చేశానని మోడీ వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలను బట్టి చూస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే సడన్‌గా బహిరంగ సభో, ప్రెస్ మీటో ప్రకటించేసి ఎదో సంచలనం చేయ్యబోతున్నట్టు హడావిడి చేస్తారు. తీరా స్టేజీ ఎక్కిన తర్వాత క్లారిటీ లేకుండా అసంబద్ధమైన విషయం మాట్లాడి ముగించేస్తారు. మోడీ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణిగుంట గరుడ నిలయం సుందరీకరణ భేష్.. విమానాశ్రయాన్ని గరుత్మంతుని ఆకారంలో..