వాళ్లిద్దరూ ప్రేమికులు. అలా ఓసారి బాయ్‌ఫ్రెండ్ ఇంటికి చేరారు. ప్రేమ మైకంలో వారిద్దరూ ఒకరోజు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. అంతే టెన్షన్‌తో యూట్యూబ్ చూసి తనకు తానే వైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌లోని నార్ఖేడ్కు చెందిన యువతి.. ఆరు నెలల క్రితం తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా కలవడంతో ఆమె గర్భం దాల్చింది.
ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతడు ఏవో మందు వేసుకుంటే అబార్షన్ అవుతుందని సూచించాడు. అవి వేసుకున్నా ఫలితం లేదు. దీంతో అబార్షన్ మందుల కోసం యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసింది. మందులు కూడా వేసుకుంది. దీంతో అనారోగ్యానికి గురైంది.
అనుమానం వచ్చి తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. అనంతరం వెంటనే ఆమెను వైద్యం కోసం నాగపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక బాయ్‌ఫ్రెండ్ వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.