Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేశాడు.. రూ.6.16 లక్షలు గోవిందా

Advertiesment
whatsapp
, సోమవారం, 15 మే 2023 (22:06 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ.6.16 లక్షలు చేజార్చుకున్నాడు. వాట్సాప్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో ఆరులక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్లా ప్రాంతానికి చెందిన యువకుడికి ఇటీవల వాట్సాప్‌లో ఓ మహిళ ఫోన్ చేసింది. వెరిఫై కోసం తను పంపించే లింక్ ద్వారా కంపెనీ వివరాల్లో నిజానిజాలను నిగ్గు తేల్చుతూ రివ్యూ ఇవ్వమని కోరింది. 
 
దీంతో, యువకుడు ఆమె పంపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. ఆ తరువాత క్షణాల వ్యవధిలో అతడి అకౌంట్లోని రూ. 6.16 లక్షలు పోయాయి. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసు : సీఎం జగన్ తమ్ముడు, కడప ఎంపీ అవినాష్‌కు సీబీఐ పిలుపు