Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజినీకాంత్‌ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్న నటి నగ్మా... రజినీ అలా అన్నారట...

జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలు రోజుకో విధంగా మారుతూనే ఉన్నాయి. అన్నాడిఎంకేలో రెండు వర్గాలుండగా, డిఎంకే పార్టీ నేతలు అన్నాడిఎంకే నేతల్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే ప్రముఖ నటుడు రజనీకాంత్ ను రాజక

రజినీకాంత్‌ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్న నటి నగ్మా... రజినీ అలా అన్నారట...
, సోమవారం, 8 మే 2017 (19:58 IST)
జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలు రోజుకో విధంగా మారుతూనే ఉన్నాయి. అన్నాడిఎంకేలో రెండు వర్గాలుండగా, డిఎంకే పార్టీ నేతలు అన్నాడిఎంకే నేతల్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే ప్రముఖ నటుడు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని బిజెపి భావించింది. ఏకంగా అమిత్ షానే రంగంలోకి దిగి రజనీతో సంప్రదింపులు జరిపారు.
 
చివరి వరకు రజినీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అందరూ భావించారు. అయితే అదంతా రివర్సయ్యింది. తాను ప్రస్తుతం బిజెపిలోకి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పారు రజనీ. తాత్కాలికంగా రజనీ రాజకీయాల్లోకి వెళ్ళడం తెరపడిందని అందరూ భావించారు. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నగ్మా రజినీని కలవడం మరోసారి ఆయన్ను రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
 
నగ్మా.. రజనీకాంత్‌తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరి కలయిక అప్పట్లో ప్రేక్షకులకు పండుగే. వీరు కలిసి నటించిన సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. అయితే ఆ తరువాత నగ్మా రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం. సినీరంగాన్ని వదలేయడం జరిగిపోయాయి. కానీ వీరి మధ్య స్నేహం మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. నిన్న ఉన్నట్లుండి నగ్మా రజినీని చెన్నైలోని తన నివాసంలో కలిశారు. దీంతో ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
కాంగ్రెస్ పార్టీలోకి రజినీని ఆహ్వానించినట్లు కూడా తెలుస్తోంది. తమిళనాడులో తిరుగులేని హీరో రజినీ..లక్షలమంది అభిమానులు ఆయనకు ఉన్నారు. ఆయన్ను కాంగ్రెస్ లోకి తీసుకుంటే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదనేది సోనియాగాంధీ భావన. అందుకే ఏకంగా నగ్మాను రంగంలోకి దిగి రజినీతో సంప్రదింపులు జరపమని పంపించినట్లు తెలుస్తోంది. అయితే రజినీ మాత్రం ఈ విషయంపై తరువాత మాట్లాడతానని చెప్పారట. అయితే ఇప్పుడు రజినీకాంత్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ మాట తీరు మార్చుకోవాలి, అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాలు... మంత్రి శిద్ధా