Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందాలను ఎరవేసి 'శ్రీమంతుల' నిలువు దోపిడి.. ఎక్కడ?

యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్

Advertiesment
అందాలను ఎరవేసి 'శ్రీమంతుల' నిలువు దోపిడి.. ఎక్కడ?
, గురువారం, 24 ఆగస్టు 2017 (11:23 IST)
యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరులోని పర్యాటక అందాలను చూసేందుకు ఎవరైనా కారులో ఒంటరిగా వస్తున్నారంటే వారిని దోచుకునేందుకు ఓ ముఠా పక్కా ప్రణాళికను రూపొందిస్తుంది. ఎవరిని.. ఎక్కడ.. ఎలా నమ్మించి వంచించాలో ఆ విధంగా అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తారు. అలా ఎరవేసే ‘అందాల’ దోపిడీ ముఠాను చివరికి రక్షకులు కటకటాల వెనక్కి నెట్టారు. 
 
యువతిని అడ్డుపెట్టుకుని శ్రీమంతులను దోపిడీ చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మైసూరు నగరానికి సమీపంలోని నంజనగూడు వద్ద మైసూరు - ఊటీ వెళ్లే పర్యాటకుల్ని ముందుగా యువతి తన వయ్యారాలతో నిలిపేది. 
 
ఆ తర్వాత ఇతర ముఠా సభ్యులు దోపిడీకి పాల్పడేవారని త‌మ విచార‌ణ‌లో తేలిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, యువతితో పాటు.. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనుషులను తిని అలసిపోయాను.. అరెస్టు చేయండి!