నా భార్యకు ఏడుగురు భర్తలు.. దాడి చేస్తోంది కాపాడండి... పోలీసుల్ని ఆశ్రయించిన బాధితుడు
బెంగళూరు నగరంలో మహిళ ఏడుగురిని పెళ్ళి చేసుకుని మోసం చేసిందనే ఘటన సంచలనం సృష్టించింది. తన భార్య ఏడుగురిని పెళ్లాడి మోసం చేసిందని సాక్షాత్తు భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు
బెంగళూరు నగరంలో మహిళ ఏడుగురిని పెళ్ళి చేసుకుని మోసం చేసిందనే ఘటన సంచలనం సృష్టించింది. తన భార్య ఏడుగురిని పెళ్లాడి మోసం చేసిందని సాక్షాత్తు భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే.. తూర్పు బెంగళూరు నగరంలోని కేజీహళ్లీకి చెందిన తన భార్య యాస్మిన్ భాను (38) తనపై దాడి చేసి కొట్టిందని ఇమ్రాన్ అనే వ్యక్తి కేజీహళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇమ్రాన్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. యాస్మిన్ ఏడుగురిని పెళ్ళాడిన మాట వాస్తవమేనని తేల్చారు. ఈ కేసులో తాము యాస్మీన్‌ను పెళ్లాడామని అఫ్జల్, షోయబ్‌లనే మరో ఇద్దరు పోలీసుల వద్దకు వచ్చారు.
తనను పెళ్లాడాక పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని యాస్మీన్ అడగ్గా తాను డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనను వదిలివెళ్లిందని రియల్ ఎస్టేట్ ఏజెంటు అయిన అఫ్జల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం మీద ఓ మహిళ ఏడుగురిని పెళ్లాడిందని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.