షమీ భార్య స్లీవ్‌లెస్ డ్రెస్ పైన 2016లో నా లాస్ట్ ఆర్టికల్... శశి థరూర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ క్రికెటర్ షమీ భార్య స్వీవ్ లెస్ డ్రెస్ వేసుకుని దిగిన ఫోటోలపై రేగిన దుమారంపై ఓ కథనాన్ని రాశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ ఈ ఏడాది నా చివరి వ్యాసం షమీ భార్య స్లీవ్ లెస్ దుస్త
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ క్రికెటర్ షమీ భార్య స్వీవ్ లెస్ డ్రెస్ వేసుకుని దిగిన ఫోటోలపై రేగిన దుమారంపై ఓ కథనాన్ని రాశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ ఈ ఏడాది నా చివరి వ్యాసం షమీ భార్య స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడం పైనే అంటూ పేర్కొన్నారు. ఇంతకీ ఆ వ్యాసంలో ఆయన రాసిందేమిటంటే.. ఆయా మతాల సంప్రదాయాలు ఉండటం ఎంత సహజమో, వ్యక్తి స్వేచ్చగా వారు తీసుకునే నిర్ణయం కూడా అంతే సహజమంటూ చెప్పుకొచ్చారు.
ఆ మాటకొస్తే పాకిస్తాన్ దేశం వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా భార్య రుట్టీ ట్రాన్సపరెంట్ షిఫాన్ గౌను వేసుకుని పార్టీలకు వెళ్లేవారని రుజువులున్నాయంటూ ఫోటోలను కూడా జోడించారు. అంతేకాదు, హిందువుల్లో కూడా వస్త్రధారణపై నియమాలు, నిబంధనలు ఉన్నాయనీ, పాటించేవారు పాటిస్తున్నారు, అలా కాకుండా తమ ఇష్టానుసారంగా వస్త్రధారణ చేసుకునేవారూ ఉన్నారంటూ వ్యాసంలో ఉటంకించారు. కాబట్టి ఎవరికి నచ్చిన వస్త్రధారణ వారు చేసుకోవచ్చనేది శశి థరూర్ మాట.