నా ముందు శశికళ దిగతుడుపే... ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం: జయలలిత మేనకోడలు దీప
అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మేనకోడలు దీప నోరు విప్పారు. జయలలిత స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ నటరాజన్‌పై దీప విమర్శలు గుప్పించారు. తన ముందు శశికళ దిగతుడుపేనని, అదేసమయంలో ప్రజాశ్రేయస్సే
అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మేనకోడలు దీప నోరు విప్పారు. జయలలిత స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ నటరాజన్‌పై దీప విమర్శలు గుప్పించారు. తన ముందు శశికళ దిగతుడుపేనని, అదేసమయంలో ప్రజాశ్రేయస్సే తన లక్ష్యమని ఆమె ప్రకటించారు. పైగా, ''నేను మతాలకతీతం. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రమించడానికి వేచి ఉన్నాన''ని టీనగర్‌లోని తన నివాసం వద్దకు భారీగా చేరుతున్న అన్నాడీఎంకే శ్రేణులను ఉద్దేశించి ప్రకటించారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం, ప్రజల కోసం శ్రమించడానికి తాను వేచి చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు నోటు పుస్తకంలో రాయాలని సూచించారు. వాటన్నింటినీ పరిశీలిస్తానని, అంతవరకు వేచి ఉండాలని కోరారు. తన పేరుతో పార్టీని ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయనీ, వాస్తవానికి ఈ విషయం తనకు తెలియదన్నారు. తాను ద్రావిడ లక్ష్య వాదినని పేర్కొన్నారు. అన్ని మతాలు తనకు ఒకటేనని, మతసామరస్యం తన లక్ష్యమని బదులిచ్చారు. సమాజ సంక్షేమానికి తన వంతు సేవలందించాలన్నదే తన ధ్యేయమని వెల్లడించారు.