Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశికళ క్రిమినల్ అనే విషయం ప్రజలకు బాగా తెలుసు: అమృత

తమిళనాడు దివంగత సీఎం జయలలిత గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలను శశికళ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. శశికళకే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు అందజ

Advertiesment
శశికళ క్రిమినల్ అనే విషయం ప్రజలకు బాగా తెలుసు: అమృత
, బుధవారం, 14 డిశెంబరు 2016 (10:40 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలను శశికళ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. శశికళకే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు అందజేయాలని ఆ పార్టీ సీనియర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో... జయలలిత బంధువులు శశికళను ఏకిపారేస్తున్నారు. శశికళ జయలలితను తన ఆధీనంలో ఉంచుకున్నదని, శశికళను ప్రజలు నమ్మరని.. ఆమె క్రిమినల్ అనే విషయం ప్రజలకు బాగా తెలుసునని జయలలిత సోదరి కుమార్తె అమృత వెల్లడించారు.  
 
తమిళనాడు ప్రజలు జయలలితను మాత్రమే అమ్మగా స్వీకరించారని, శశికళ అంటేనే ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదని అమృత చెప్పుకొచ్చారు. జయలలిత ఆస్తిలో ఒక్క పైసా కూడా తనకు అక్కర్లేదని.. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. జయలలిత తమిళనాడు ప్రజల కోసం పాటుపడ్డారు. ప్రజలకు సేవ చేశారు. అమ్మ ఆస్తులను ప్రభుత్వం కైవసం చేసుకుని.. ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు.    

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోట్లిచ్చినా సరిపోలేదు.. భార్యను వేధించి చంపేసిన మాజీ సెషన్స్ జడ్జి.. ఇదేం బుద్ధి బాబోయ్