Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25 వేల అపరాధం ఎక్కడ?

ఆ గ్రామంలో అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25వేల అపరాధం విధించాలని ముస్లిం మతపెద్దల పంచాయితీ తీర్మానించింది. అలాగే, గోవధకు పాల్పడితే రూ.2.50 లక్షల అపరాధం విధించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ముస్లిం మత

అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25 వేల అపరాధం ఎక్కడ?
, శుక్రవారం, 5 మే 2017 (16:23 IST)
ఆ గ్రామంలో అమ్మాయి ఫోన్ మాట్లాడితే రూ.25వేల అపరాధం విధించాలని ముస్లిం మతపెద్దల పంచాయితీ తీర్మానించింది. అలాగే, గోవధకు పాల్పడితే రూ.2.50 లక్షల అపరాధం విధించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ముస్లిం మతపెద్దల పంచాయతీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లా మడోరా గ్రామంలో సుమారు మూడు వేల మంది ముస్లింలు నివశిస్తున్నారు. అంటే.. ఈ గ్రామంలో ముస్లింలదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో గో సంరక్షణ కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాటుపడుతున్నారు. ఈయనకు అండగా నిలబడేందుకు వీలుగా ఈ ముస్లిం గ్రామ పెద్దలు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. 
 
గోవధకు పాల్పడిన వారికి రూ.2.5లక్షల జరిమానా విధించాలని... అందులో రూ.51 వేలను సమాచారం అందించిన వారికి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, రోడ్లపై ఆడపిల్లలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళితే రూ.21 వేలు జరిమానా విధించాలని పంచాయతీ సభ్యులు నిర్ణయించారు. బాలికలపై జరుతున్న నేరాలను అరికట్టేందుకు, పారిపోతున్న ప్రేమ జంటలకు చెక్ పెట్టేందుకు ఈ తీర్మానం తీసుకున్నట్టు గ్రామస్తులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదవీకాలం ముగిసేలోగా చిత్తూరు జిల్లాకు సాగు, తాగు నీరిందించడమే ధ్యేయం