Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంతానం కోసం 10 పెళ్ళిళ్లు.. కానీ ప్రయోజనం లేదు.. చివరికి హతుడైనాడు.. ఎలా?

Advertiesment
సంతానం కోసం 10 పెళ్ళిళ్లు.. కానీ ప్రయోజనం లేదు.. చివరికి హతుడైనాడు.. ఎలా?
, శుక్రవారం, 22 జనవరి 2021 (15:56 IST)
సంతానం కలగలేదని పది పెళ్ళిళ్లు చేసుకున్నా ఆ వ్యక్తికి ప్రయోజనం లేదు. కోట్ల రూపాయల ఆస్తి వున్నా అనుభవించే వారంటూ లేరు. అటు భార్యలు లేరు.. ఇటు పిల్లలు లేరు. దీంతో అతని ఆస్తిపై కన్నేసిన కొందరు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో వెలుగు చూసింది. 
 
వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాకు చెందిన జగన్ లాల్ యాదవ్‌ 1990 నుంచి ఇప్పటి వరకు పది పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి ఐదుగురు భార్యలు అనారోగ్యంతో చనిపోయారు. ముగ్గురు భార్యలు యాదవ్‌ను వదిలేసి వెళ్లిపోయారు. ఇక మిగిలిన ఇద్దరు భార్యలు యాదవ్‌తోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఊరికి దగ్గరలోని పంట పొలంలో జగన్‌లాల్‌ శవమై కనిపించాడు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసమే అతడ్ని చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు భార్యలతో కలిసి జీవిస్తున్నాడు. వారిద్దరూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. ఇద్దరి భార్యల్లోని.. ఒకామెకు మొదటి భర్త ద్వారా కలిగిన కుమారుడు ఉన్నాడు. అతను కూడా వీరితో కలిసి నివసిస్తున్నాడు.
 
హతుడికి మేయిన్‌ రోడ్డు పక్కన స్థలం ఉంది. దానికి మార్కెట్‌లో చాలా విలువ ఉంది. దాని కోసమే అతడ్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి నిత్యపెళ్లికొడుకు జగన్ లాల్ హత్య స్థానికంగా కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సర్కార్‌కి మరో షాక్, ఆదివారం నిమ్మగడ్డ ఉత్తర్వులు