శీలంతో పాటు సర్వం దోచుకున్నాడు.. అర్హాన్ అక్తర్‌పై ముంబై మోడల్ ఫిర్యాదు
బాలీవుడ్ దర్శకుడు అర్హాన్ అక్తర్‌తో పాటు.. ఇద్దరు ఫైనాన్షియర్లపై ముంబై మోడల్ ఒకరు ఫిర్యాదు చేసింది. మోడల్‌గా కొనసాగుతూ వచ్చిన తనకు బాలీవుడ్ వెండితెరపై నటిగా రాణించాలన్న కోరికను అలుసుగా తీసుకుని తనను మ
బాలీవుడ్ దర్శకుడు అర్హాన్ అక్తర్‌తో పాటు.. ఇద్దరు ఫైనాన్షియర్లపై ముంబై మోడల్ ఒకరు ఫిర్యాదు చేసింది. మోడల్‌గా కొనసాగుతూ వచ్చిన తనకు బాలీవుడ్ వెండితెరపై నటిగా రాణించాలన్న కోరికను అలుసుగా తీసుకుని తనను మోసం చేయడంతో పాటు.. తనపై అత్యాచారం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి కథనం మేరకు... ఇమ్రాన్ ఖాన్ హీరోగా తాను తీయబోయే సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని అర్హాన్ హామీ ఇచ్చాడు. అయితే, తన కోరిక తీరిస్తేనే ఈ చాన్స్ లభిస్తుందని ఆయన చెప్పడంతో, సినిమా చాన్స్ కోసం ఆమె అంగీకరించింది.
ఆపై చిత్రానికి డబ్బు పెట్టేవాళ్లంటూ, ఇద్దరు ఫైనాన్షియర్ల వద్దకు ఆమెను వెళ్లమని చెప్పాడు. లక్నో, ఢిల్లీకి చెందిన ఫైనాన్షియర్ల వద్దకు మోడల్ వెళ్లింది. ఆపై సినిమా అవకాశం చేజిక్కలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.