ఏయ్... బలవంతంగా నాకు కట్టబెట్టారే... నీవు నాకొద్దు... పెళ్లైన నాలుగు రోజులకే..!
దేశవాణిజ్య రాజధాని ముంబైలో దారుణం జరిగింది. వివాహమైన నాలుగు రోజులకే భార్యను ఓ కసాయి భర్త కాటికి పంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే.... ఏప్రిల్ 6వ తేదీన ముంబైకి చెందిన 25 ఏళ
దేశవాణిజ్య రాజధాని ముంబైలో దారుణం జరిగింది. వివాహమైన నాలుగు రోజులకే భార్యను ఓ కసాయి భర్త కాటికి పంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే.... ఏప్రిల్ 6వ తేదీన ముంబైకి చెందిన 25 ఏళ్ల ఆసిఫ్ సిద్దిఖీకి 22 ఏళ్ల సబ్రీన్‌తో ఉత్తర్‌ప్రదేశ్‌లో వివాహం జరిగింది. ఆసిఫ్ ముంబైలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత నూతన వధూవరులు ముంబైలోని బొరివాలికి వచ్చారు.
ఏప్రిల్ 10న ముంబైలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతిచెందిన మహిళపై అదృశ్య కేసులేమైనా నమోదై ఉండొచ్చనే అనుమానంతో ముంబై, థానే, నవీముంబై, సిందుదుర్గ్ ప్రాంతాల్లో పోలీసు బృందాలు విచారణ జరిపాయి. చివరకు యూపీలోని బారాబంకీ జిల్లాలో కేసు నమోదైనట్లు గుర్తించారు. ఈ కేసుతో హత్యకు గురైన మహిళను సబ్రీన్‌గా నిర్ధారించారు. ఆ కేసు ఆధారంగా నిందితుడు ఆసిఫ్‌ను అరెస్టు చేశారు.
తమ విచారణలో సబ్రీన్‌ను గొంతు నులిమి చంపినట్లు ఘటనాస్థలంలో కీలక ఆధారాలు లభించాయని, నిందితుడిని లఖ్‌నవూలో అరెస్టు చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ విక్రమ్ దేశ్‌మానే చెప్పారు. సబ్రీన్‌తో బలవంతంగా పెళ్లి చేశారనీ, అందుకే హత్య చేసినట్టు వాంగ్మూలం ఇచ్చాడు.