Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరు ఎయిర్ పోర్టు రోడ్డులో సడెన్ బ్రేక్.. తొమ్మిది కార్లు ధ్వంసం

Advertiesment
Car
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (13:32 IST)
Car
కర్ణాటకలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది కార్లు దెబ్బతిన్నాయి. కొంతమందికి స్వల్ప గాయాలైనాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ అత్యవసర పనులకు వెళ్తున్న ప్రయాణీకులు మాత్రం ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో కెంపేగౌడ్ ఎయిర్‌పోర్టు రోడ్డులో వరుసగా పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది కార్లు ధ్వంసం అయ్యాయి. ఎయిర్‌పోర్టు రోడ్డులోని సాదళ్లి గేట్ ముందు నుంచి వెళ్తున్న ఒక కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేడయంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వచ్చిన కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చిక్కజాల పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ భవిష్యత్ కూడా ఇదేనా? కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ప్రశ్న?