Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మీ నాన్న జగమొండి'.... మనుమరాలితో ములాయం :: అవును నేను మొండివాడినే...అఖిలేష్

తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ తనకు చుక్కలు చూపించడాన్ని ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ములాయం దిగిరాక తప్పలేదు. పైగా, తన వద్దకు వచ్చే అఖిలేష్ కుమార్తెలు,

'మీ నాన్న జగమొండి'.... మనుమరాలితో ములాయం :: అవును నేను మొండివాడినే...అఖిలేష్
, మంగళవారం, 10 జనవరి 2017 (06:12 IST)
తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ తనకు చుక్కలు చూపించడాన్ని ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ములాయం దిగిరాక తప్పలేదు. పైగా, తన వద్దకు వచ్చే అఖిలేష్ కుమార్తెలు, తమ మనుమరాళ్లతో తన మనసులోని మాటను ములాయ బయటపెట్టాడు. 
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలో ములాయం, అఖిలేశ్‌ నివాసాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి నేరుగా వెళ్లేందుకు మార్గం కూడా ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాక... అటూఇటూ రాకపోకలు ఇరు కుటుంబ సభ్యుల రాకపోకలు బంద్ అయ్యాయి. 
 
కానీ, ఇద్దరే ఇద్దరు మాత్రం వస్తూపోతున్నారు. వారు ఎవరో కాదు... అఖిలేష్‌-డింపుల్‌ కుమార్తెలైన అదితి (15), టీనా (10). అందులోనూ... టీనా పరుగు పరుగున తాతయ్య ములాయం వద్దకు వెళ్లి ఆడుకుంటోంది. ములాయం టీనాతో 'మీ నాన్న చాలా మొండివాడమ్మా' అని అన్నారు. టీనా నేరుగా తండ్రి వద్దకు వెళ్లి 'తాతయ్య ఇలా అన్నాడు' అని చెప్పింది. దీనికి అఖిలేశ్‌ స్పందిస్తూ.. 'అవును నేను మొండివాడినే' అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
 
ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తనే స్వయంగా ముగింపు పలికారు. పార్టీ గుర్తుపై ఎన్నికల సంఘం సమక్షంలో వాదోపవాదాలు పూర్తయి.. తీర్పుపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సోమవారం రాత్రి అనూహ్య ప్రకటన చేశారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా కుమారుడు అఖిలేశ్‌ పేరును ప్రకటించారు.
 
'ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేశ్‌ యాదవ్‌. ఇకపై పార్టీలో అందరం కలిసే ఉంటాం. మాలో ఎవరికీ భేదాభిప్రాయాల్లేవు' అని స్పష్టం చేశారు. 'మేమంతా ఒకటేనని చెప్పేందుకు త్వరలోనే యూపీలో పర్యటిస్తాం. ఎస్పీలో నెలకొన్న అనిశ్చితికి చరమగీతం పాడతాం' అని ములాయం వెల్లడించారు. తనే పార్టీ చీఫ్‌నని అభ్యర్థులకు తనే బీఫారాలిస్తానంటూ ఢిల్లీలో ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. ఈ ప్రకటన చేయటం రాజకీయంగా ఆసక్తి కలిగించింది. కాగా, మంగళవారం ఉదయం అఖిలేశ్‌ - ములాయం భేటీఅయ్యే అవకాశాలున్నాయి. అ తర్వాతేతదుపరి అంశాలపై స్పష్టత రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌కు స్కార్పీన్‌ జలాంతర్గామి సిద్ధం :: జలాంతర్గామి అణు సామర్థ్య క్షిపణిని పరీక్షించిన పాక్‌