Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ వ్యక్తిగత సమాచారం గుట్టు రట్టు.. ఆధార్ నిర్వాకంపై సాక్షి ధ్వజం

ఆధార్ కార్డ్ నిర్వాహకుల నిర్వాకం పుణ్యమా అని భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ వ్యక్తిగత సమాచారం బట్టబయలైపోయింది. తనకు ఆధార్ కార్డు కావాలని ధోనీ పెట్టుకున్న పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వ ఏజెన్సీ సిఎస్‌సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అధికారు

ధోనీ వ్యక్తిగత సమాచారం గుట్టు రట్టు.. ఆధార్ నిర్వాకంపై  సాక్షి ధ్వజం
హైదరాబాద్ , బుధవారం, 29 మార్చి 2017 (07:51 IST)
ఆధార్ కార్డ్ నిర్వాహకుల నిర్వాకం పుణ్యమా అని భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ వ్యక్తిగత సమాచారం బట్టబయలైపోయింది. తనకు ఆధార్ కార్డు కావాలని ధోనీ పెట్టుకున్న పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వ ఏజెన్సీ సిఎస్‌సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అధికారులు ధోనీ వేలిముద్రలను సిస్టమ్‌లో స్కాన్ చేయడంతో ఆగిపోకుండా అత్యుత్సాహం చూపిన ఫలితంగా ధోనీ దరఖాస్తు పత్రం బహిరంగమైపోయింది. ఎలా అంటే.. ఈ జార్ఖండ్ క్రికెటర్ సమర్పించిన ఆధార్ కార్డు దరఖాస్తుపత్రాన్ని స్క్రీన్ షాట్ తీసిన నిర్వాహకులు నేరుగా దాన్ని ట్విట్టర్‌లో ట్వీట్ చేయడంతో ధోనీ కొంప మునిగింది.
 
వ్యక్తిగత సమాచారం ఉండే దరఖాస్తు పత్రాన్ని ఇలా సోషల్ మీడియాకు ఎలా పంపుతారంటూ ధోని భార్య సాక్షి నేరుగా కేంద్ర న్యాయ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రిగారూ, ధోనీ విషయంలో గోప్యత ఏదైనా ఇంకా మిగిలి ఉందా. ధోని దరఖాస్తుపత్రంలో పొందపర్చిన ఆధార్ కార్డు సమాచారం  ఇప్పుడు ప్రజల ఆస్తిలాగా మారిపోయింది. తీవ్ర అసంతృప్తి చెందుతున్నాను అంటూ సాక్షి మంత్రికి ఫిర్యాదు చేశారు. 
 
ధోనీ ఇక్కట్లు అంతటితో ఆగాయా అంటే ఆగలేదు. విచిత్రం ఏమిటంటే మంత్రి రవిశంకర్ ప్రసాద్ సైతం అదే తప్పు చేశారు. ప్రభుత్వ ఏజెన్సీ ధోనీ దరఖాస్తుపత్రంపై చేసిన ట్వీట్‌ను మంత్రి తొందరపాటుతో రీ ట్వీట్ చేశారు దాంతో అది ఇంకా చేరనివాళ్లకు శుభ్రంగా చేరిపోయింది. 
 
సాక్షి ట్వీట్‌కు మంత్రి రవిశంకర ప్రసాద్ స్పందిస్తూ, లేదు లేదు. ధోనీ సమాచారం పబ్లిక్ ప్రాపర్టీ కాదు, ఈ ట్వీట్ ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉందా అని రీట్వీట్ చేశారు. దాంతో సాక్షి ఆ ప్రభుత్వ ఏజెన్సీ తన భర్త ఆధార్ కార్డు సమాచారాన్ని ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్‌ను మంత్రికి పంపారు. ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు మంత్రి సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత సమాచారం షేర్ చేయడం చట్టవిరుద్ధం అని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్య తీసుకుంటామని ప్రసాద్ దాన్ని రీట్వీట్ చేశారు. మంత్రి అనాలోచితంగా చేసిన ఈ రీట్వీట్ వల్ల అది ఇంకా చాలామందికి తెలిసిపోయినట్లయింది.
 
సాక్షి ట్వీట్‌ను సరిగా అర్థం చేసుకోని మంత్రి ఏజెన్సీ పోస్ట్  చేసిన ట్వీట్‌లలో ఏదీ లీక్ కాలేదంటూ రీట్వీట్ చేసేశారు. కేంద్రమంత్రులకే వ్యక్తుల గోప్యత ఎంత ముఖ్యమైనదో అవగాహన లేనప్పుడు ఆధార్ కార్డులో సమాచార గోప్యత పాటిస్తారని ఎలా నమ్మాలి?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కశ్మీర్‌లో ప్రమాదకర పరిణామాలు.. సైన్యంపై తిరగబడుతున్న జనం