Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఘనకార్యాన్ని అయ్యగారు లోక్‌సభలో చెబుతారట: క్షమాపణ కాదు వివరణట

ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ మరోసారి తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేయనున్నారని సమాచారం. అదీ కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరై తన వైపునుంచి ఆ ఘటనకు సంబంధించి వివరణ ఇస్తారట. ఈ సమాచారం కూడా తన నోటి నుంచి వచ్చిది

ఆ ఘనకార్యాన్ని అయ్యగారు లోక్‌సభలో చెబుతారట: క్షమాపణ కాదు వివరణట
హైదరాాబాద్ , గురువారం, 6 ఏప్రియల్ 2017 (04:14 IST)
మా ఉద్యోగిని చెప్పుతో కొడతావా.. నీ దిక్కున్న చోట చెప్పుకో పో.. అని ఆ సంస్థలు ఈసడించుకుంది. ప్రవేశం లేకుండా నిషేధించిందీ, పరువు తీసిందీ అల్లాటప్పా దారినపోయే దానయ్యను కాదు. శ్రీమాన్ పార్లమెంటు సభ్యుడిని. ఆ దెబ్బతో మహారాష్ట్ర పరువు పోయింది. తర్వాత పార్లమెంటు పరువు పోయింది. ఫైనల్‌గా ఈ దేశం పరువు కూడా పోయింది. ఇప్పుడీ పెద్దమనిషి ఇప్పటికీ దర్పం తగ్గకుండా తన ఘనకార్యాన్ని లోక్‌సభలోనే విప్పి చెప్పి తాను చేసింది తప్పు కాదని నిరూపిస్తాడట.
 
ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ మరోసారి తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేయనున్నారని సమాచారం. అదీ కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరై తన వైపునుంచి ఆ ఘటనకు సంబంధించి వివరణ ఇస్తారట. ఈ సమాచారం కూడా తన నోటి నుంచి వచ్చిది కాదు. ఆయనగారికి అత్యంత సన్నిహితుడు మీడియాకు చేరవేశారు మరి. గురు లేదా శుక్రవారాల్లో రవీంద్ర గైక్వాడ్‌ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతారని ఆయన తెలిపారు. తొలుత లోక్‌సభలో ఘటనకు సంబంధించి తనవైపు నుంచి ఏం జరిగిందో చెబుతారని, ఆ తర్వాతే మీడియా ముందు మాట్లాడతారని వెల్లడించారు.
 
బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ఇవ్వలేదన్న కోపంతో గత నెల్లో ఎయిరిండియా సీనియర్‌ మేనేజర్‌ను రవీంద్ర గైక్వాడ్‌ 25 సార్లు చెప్పుతో కొట్టడమే కాకుండా.. ఈ ఘటనలో తాను క్షమాపణ చెప్పేది లేదని, ఎయిరిండియా సిబ్బందే తనకు క్షమాపణ చెప్పాలని హఠం వేయడం తెలిసిందే. కానీ సదరు ఎంపీ చర్యను తీవ్రంగా ఖండించిన ఎయిరిండియా సంస్థ ఆయనను నిషేధిత జాబితాలో చేర్చింది. ఎయిరిండియాతో పాటు మరికొన్ని ఎయిర్‌లైన్లు కూడా ఆయనను నిషేధించాయి. మరోసారి గైక్వాడ్‌ ఎయిరిండియాలో టికెట్‌ బుక్‌ చేయగా సదరు సంస్థ రద్దు చేసింది. ఆ తర్వాత వేర్వేరు పేర్లతో మరో మూడుసార్లు బుక్‌ చేసినా ఎయిరిండియా గుర్తించి ఆయన టికెట్‌ను రద్దు చేసింది. 
 
ఒక రకంగా చెప్పాలంటే ఎంపీ ఇజ్జత్‌ను విమానయాన సంస్థలు పీకిపడేశాయి. భవిష్యత్తులో ఏ ఎంపీ కాని, రాజకీయ నేత కానీ, అధికార మదాంధులు కానీ విమానయాన సంస్థల సిబ్బందిపై చేయి వేయాలన్నా గజగజా వణకాల్సిన పరిస్థితిని ఈ అహంకారపు ఎంపీ అందరినెత్తికి తెచ్చిపెట్టాడు. ఈయన రేపు లోక్‌సభలో ఏ వీరంగమాడినా, ఎంత సమర్థన చేసుకున్నా.. ఏ ఒక్క సభ్యుడైనా అతడివైపు నిలిచే ప్రసక్తి మాత్రం లేదు. 
 
మామూలుగా అయితే ఇలాంటి నిషేధ చర్యలపై వెంటనే కోర్టులకు పరుగెత్తే ఆవకాశం ఉండేది. కానీ బిజినెస్ క్లాస్ టికెట్ లేదన్న పాపానికి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నీవు చెప్పుదెబ్బలు కొడతావా అని కోర్టు నిలదీసే ప్రమాదం ఉంది కాబట్టే ఆ ఎంపీకి మొఖం చెల్లక కోర్టు గుమ్మం తొక్కలేదు. రేపు లోక్‌సభలో అయ్యగారు దీనిపై వివరణ ఇచ్చుకుని మీడియా ముందు ఒక సారీ పడేసి, విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజును గడ్డం పట్టుకుని లోపాయికారీగా తనపై నిషేధాన్ని ఎత్తివేయించుకున్నా ఆశ్చర్యపడనక్కరలేదు కానీ..
 
ఎంపీల గౌరవాన్ని, ప్రతిష్టనూ ఘోరంగా దెబ్బతీసిన తన చర్యకు గాను తన జీవితకాలంలో ఇకపై ఎయిరిండియా జోలికి పోలేడు. ఇదీ మాత్రం వాస్తవం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు గట్టి షాక్... నేనే ముఖ్యమంత్రినైతే వారితో రాజీనామా చేయిస్తా... విష్ణు