Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధ్వాన్నంగా రోడ్లు .. సారీ చెబుతూ వ్యక్తి కాళ్లు కడిగిన మంత్రి

minister washed feet
, మంగళవారం, 17 జనవరి 2023 (09:33 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని కీలక పట్టణాల్లో ఒకటైన గ్వాలియర్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర మంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఓ వ్యక్తి పాదాలు కూడా కడిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలను పరిశీలిస్తే, 
 
గ్వాలియర్‌లో రోడ్ల దుస్థితిని స్వయంగా కళ్లారా చూసిన ఆ రాష్ట్ర ఇంధన శాఖామంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ స్థానిక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఓవ్యక్తి పాదాలను కడిగి సంచలనం రేపారు. 

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, "రోడ్డు దుస్థతికి నేను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. మురుగునీటి పైపులైన్ పని కోసం తవ్విన రహదారిని బాగు చేస్తానని హామీ ఇస్తున్నాను" అని ప్రధుమన్ సింగ్ తోమర్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిజాబ్ ధరించకపోవడం వల్లే వర్షాలు కురవడం లేదు : ఇరాన్ మతగురువు