Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే..నో చెప్పింది.. అంతే అమ్మనే కాల్చేశాడు..

ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. తల్లితో ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానన్నాడు. కానీ అందుకు వ్యతిరేకించింది. అంతే కోపంతో ఊగిపోయిన ఆ పుత్రుడు ఏకంగా తల్లినే పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భో

Advertiesment
Mother shot for opposing love marriage: Son arrested
, బుధవారం, 21 డిశెంబరు 2016 (10:31 IST)
ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. తల్లితో ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానన్నాడు. కానీ అందుకు వ్యతిరేకించింది. అంతే కోపంతో ఊగిపోయిన ఆ పుత్రుడు ఏకంగా తల్లినే పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. భోపాల్ నగరంలోని గౌతంనగర్ ప్రాంతానికి చెందిన జమీలాబి బీజేపీ మహిళా విభాగం నాయకురాలిగా పనిచేసేవారు. జమీలాబీకి అమన్ (22) అనే కుమారుడున్నాడు. 
 
తల్లి తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వీల్లేదని అడ్డం తిరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అమన్ తల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం తాను హాలులో నిద్రపోతుండగా తల్లిని ఎవరో వచ్చి కాల్చిచంపారని అమన్ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మళ్లీ మాట మార్చి అబద్ధాలు చెప్పడంతో ఆ కుమారుడు అడ్డంగా బుక్కయ్యాడు. 
 
ఇంకా పోలీసుల విచారణలో అమన్ స్థానికంగా ఉన్న ఓ అమ్మాయిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. కాగా దీన్ని వ్యతిరేకించిన తల్లి జమీలాబి అమ్మాయి ఎంపిక తన ఇష్టంతోనే జరుగుతుందని తేల్చిచెప్పారు. దీంతో గతనెల 30 వ తేదీన తల్లీ కుమారుడి అమ్మాయి ఎంపిక విషయమై మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా తల్లినే పుత్రుడు కాల్చి చంపేశాడని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బళ్లారి బీజేపీ ఎంపీ గన్‌మెన్ అరెస్ట్.. గాలి జనార్ధన్ రెడ్డికి భయం భయం..