Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కవల పిల్లలను గట్టిగా కౌగిలించుకుని ఊపిరాడనీయకుండా చంపేసిన కసాయి తల్లి

కవల పిల్లలు పుట్టారు. వారు ఆలనాపాలనా చూసుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. మాతృత్వానికే మచ్చ తెచ్చింది. రెండో కాన్పులో ఆడపిల్లలు పుట్టారని అత్తింటివారు ఆగ్రహించడంతో.. తన కడుపున పుట్టిన చంటి

Advertiesment
Mother
, మంగళవారం, 6 జూన్ 2017 (13:09 IST)
కవల పిల్లలు పుట్టారు. వారు ఆలనాపాలనా చూసుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. మాతృత్వానికే మచ్చ తెచ్చింది. రెండో కాన్పులో ఆడపిల్లలు పుట్టారని అత్తింటివారు ఆగ్రహించడంతో.. తన కడుపున పుట్టిన చంటి కవలలను కౌగిలించుకుని ఊపిరాడనీయకుండా ఆ కసాయి తల్లి చంపేసింది. ఈ దుర్ఘటన తమిళనాడు, కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నాగర్‌కోవిల్‌, కాట్రాడితట్టుకు చెందిన కన్నన్ (39), దివ్య (29) దంపతులకు రెండేళ్ల కుమార్తె వుంది. రెండో కాన్పులోనూ ఆమెకు కవలలుగా ఆడిపిల్లలు పుట్టారు. ఈ విషయం తెలుసుకున్న కన్నన్ కుటుంబీకులు దివ్యను, ఆమె కవల పిల్లల్ని చూసేందుకు రాలేదు. దీంతో దివ్య ఆస్పత్రి నుంచి అమ్మవారింటికి చేరుకుంది. ఎన్ని రోజులైనా తన బిడ్డల్ని చూసేందుకు అత్తింటివారు రాకపోవడంతో ఇక లాభం లేదనుకున్న దివ్య కన్నబిడ్డల్ని గట్టిగా కౌగలించుకుని ఊపిరాడనివ్వకుండా చేసి చంపేసింది. ఆపై పాలు తాగుతుండగా కవలలు చనిపోయారని స్థానికులను నమ్మించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న కన్నన్‌ గుట్టుచప్పుడు కాకుండా పసికందుల మృతదేహాలను తన స్వంత ఊరైన కాట్రాడితట్టుకు తీసుకెళ్లి పాతిపెట్టేశాడు. అయితే కవలలు ఆకస్మికంగా మరణించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ శిశు సంక్షేమ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆపై ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దివ్యను విచారించగా అసలు నిజం బయటపడింది. 
 
అత్తింటివారు అలిగారని కవలలను గట్టిగా కౌగిలించుకుని చంపేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనపై కన్నన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కవలల మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టంకు పంపారు. కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నమ్మను రహస్యంగా కలిసిన విజయమ్మ.. విలీనానికి 2 నెలల గడువు ఇచ్చిన దినకరన్..?