Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.37,54,06,23,616 ఇదీ ప్రధాని మోడీ ప్రచార ఖర్చు

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ చాయ్ వాలా అని, ఆయన కింది స్థాయి నుంచి ప్రధాని పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారన్నది బీజేపీ నేతలు ఊకదంపుడు ప్రచారం.

రూ.37,54,06,23,616 ఇదీ ప్రధాని మోడీ ప్రచార ఖర్చు
, సోమవారం, 11 డిశెంబరు 2017 (12:27 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ చాయ్ వాలా అని, ఆయన కింది స్థాయి నుంచి ప్రధాని పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారన్నది బీజేపీ నేతలు ఊకదంపుడు ప్రచారం. పైగా, అయన చాలా పొదుపుగా ఉంటారనీ, చాలా నిరాడంబరంగా జీవిత గడుపుతారని కమలనాథులు ప్రచారం చేస్తుంటారు. ఇలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పైగా, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని తెలుస్తోంది. 
 
గత మూడేళ్ళలో అంటే 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.37,54,06,23,616 ఖర్చు చేసింది. ఈ విషయం గ్రేటర్ నోయిడాకు చెందిన రాం వీర్ తన్వార్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం క్రింద అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. దానిలో ఏ మాధ్యమాలలో ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టిందీ వివరాలు కూడా ఇచ్చింది. 
 
ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కోసం రూ.1,656 కోట్లు, ప్రింట్ మీడియాలో ప్రచారం కోసం రూ.1,656 కోట్లు, హోర్డింగులు, ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లు వగైరాల కోసం మరో రూ.399 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలియజేసింది. అన్నీ కలిపి మొత్తం రూ.37,54,06,23,616 ఖర్చయినట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఈ మొత్తం స్వదేశంలో మోడీ ప్రచారం కోసం ఖర్చు చేశారు. 
 
ఇక మోడీ దేశంలో ఉన్నప్పుడే ఇంత ఖర్చు చేస్తే, ఇక విదేశీయాత్రల ఖర్చు ఇంతకు పదింతలు ఉన్నా ఆశ్చర్యం లేదు. గ్యాస్‌పై సబ్సీడీని వదులుకోమని పిలుపునివ్వడం ద్వారా దేశానికి వేలకోట్లు పొదుపు చేశానని గొప్పలు చెప్పుకొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన వ్యక్తిగత, ప్రభుత్వ పథకాల ప్రచారానికి రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళితుల ముక్కుతో నేలకు రాయించి.. మురికి నీటిలో మునక..